వావ్.. పౌరాణిక చిత్రంలో అల్లు అర్జున్ కుమార్తె.. ఎంట్రీ అదిరిందిగా!
Send us your feedback to audioarticles@vaarta.com
అల్లు ఫ్యామిలీ నుంచి క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. అల్లు వారి కుటుంబంలో నాలుగోతరం నటులు రెడీ అవుతున్నారు. అల్లు రామలింగయ్య తర్వాత అల్లు అరవింద్.. ఆ తర్వాత అల్లు అర్జున్ సినిమాల్లో కొనసాగుతుండగా ఇప్పుడు అల్లు అర్జున్ ముద్దుల కుమార్తె అల్లు అర్హ టాలీవుడ్ లో కి ఎంట్రీ ఇవ్వనుంది.
ఈ గుడ్ న్యూస్ ని బన్నీ స్వయంగా సోషల్ మీడియా వేదికగా రివీల్ చేశారు. 'మా అల్లు కుటుంబానికి ఇది ప్రౌడ్ మూమెంట్. నాల్గవ జనరేషన్ అల్లు అర్హ 'శాకుంతలం' చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ అద్భుతమైన చిత్రంతో నా కుమార్తెని టాలీవుడ్ లోకి పరిచయం చేస్తున్న గుణశేఖర్ గారికి, నీలిమ గారికి కృతజ్ఞతలు. సమంత, నేను కలసి నటించాం. ఇప్పుడు నా కుమార్తె ఆమె చిత్రంలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. శాకుంతలం టీంకు నా బెస్ట్ విషెష్' అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు.
గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ లో తెరకెక్కిస్తున్న చిత్రం శాకుంతలం. మహాభారతంలో అత్యంత కీలకమైన దుష్యంతుడు, శకుంతల కథని గుణశేఖర్ విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
శాకుంతలంలో సమంత ప్రధాన పాత్రలో టైటిల్ రోల్ పోషిస్తోంది. శకుంతల తనయుడే భరతుడు. అల్లు అర్హ ఈ చిత్రంలో చిన్ననాటి భరతుడి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్హ తన క్యూట్ క్యూట్ అల్లరితో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏకంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఆసక్తిగా మారింది.
ఇక గుణశేఖర్ కి, అల్లు అర్జున్ కి ప్రత్యేక అనుబంధం ఉంది. వరుడు, రుద్రమదేవి చిత్రాలు గుణశేఖర్ దర్శత్వంలోనే తెరకెక్కాయి. రుద్రమదేవిలో బన్నీ నటించిన గోనగన్నారెడ్డి పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
A proud moment for the Allu family to announce that the fourth generation, #AlluArha will be making her debut with #Shakuntalam movie. I want to thank @Gunasekhar1 garu & @neelima_guna garu for giving my daughter this beautiful movie as her debut . pic.twitter.com/iPfXQaqJCk
— Allu Arjun (@alluarjun) July 15, 2021
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com