Allu Arjun:సినీ జనాలకు షాకిచ్చిన అల్లు అర్జున్ : షారుఖ్ ‘‘జవాన్’’లో కీ రోల్‌.. సైలెంట్‌గా షూట్ పూర్తిచేశాడట..?

  • IndiaGlitz, [Tuesday,April 11 2023]

బాహుబలి సిరీస్ , పుష్ప, ఆర్ఆర్ఆర్ , కార్తీకేయ తదితర సినిమాలు బ్లాక్‌బస్టర్‌లు కావడం. ఆర్ఆర్ఆర్‌కు ఏకంగా ఆస్కార్ రావడంతో ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ భారతదేశంలో ఎవరికీ అందని ఎత్తులో వున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బీ టౌన్ స్టార్స్ సైతం అంతా టాలీవుడ్ వెంట పడుతున్నారు. చివరికి వాళ్ల సినిమా ప్రచార కార్యక్రమాలకు కూడా మన హీరోలను పక్కన కూర్చొబెట్టుకున్నారు. అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణ్‌బీర్ కపూర్, ‌అక్షయ్ కుమార్ ఇలా ఎవరూ దీనికి అతీతం కాదు.

హిందీ సినిమాల్లో తెలుగు హీరోల గెస్ట్ అప్పియరెన్స్ :

ఇదిలావుండగా.. పలువురు తెలుగు స్టార్ హీరోలు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత అగ్ర కథానాయకుడు వెంకటేశ్ హిందీలో సల్మాన్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. అదే సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఓ గెస్ట్ రోల్‌లో నటిస్తున్నారు. నిన్నగాక మొన్న హృతిక్ రోషన్‌ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఓ పాత్ర పోషిస్తారని ఓ గాసిప్ హల్చల్ చేసింది. అయితే ఆ తర్వాత ఇది గాలి వార్తేనని తేలింది.

బన్నీ ప్లేస్‌లో విజయ్, సంజయ్ దత్‌లు నటిస్తారని ప్రచారం :

తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి సంబంధించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న జవాన్ అనే సినిమాలో బన్నీ ఓ కీ రోల్‌ పోషించబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే పుష్ప 2 షూటింగ్‌లో బీజీగా వుండటంతో ఆయన స్థానంలో విజయ్ లేదా సంజయ్ దత్‌లు ఈ సినిమాలో నటిస్తారని ప్రచారం జరిగింది.

సైలెంట్‌గా పనికానిచ్చిన అల్లువారబ్బాయ్:

కానీ ఈరోజు వీటన్నింటికి చెక్ పెడుతూ మరో వార్త వెలుగులోకి వచ్చింది. అట్లీ - షారుఖ్ సినిమాలో బన్నీ స్థానం ఆయనకే వుందని, మరెవ్వరికీ అవకాశం ఇవ్వలేదన్నది ఆ వార్త సారాంశం. అంతేకాదు.. ఈ సినిమాలో తన క్యారెక్టర్ కోసం అల్లు అర్జున్ షూటింగ్ కూడా పూర్తి చేసినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. బన్నీ లుక్‌, టీజర్‌ను కూడా త్వరలోనే మేకర్స్ రిలీజ్ చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. కానీ ఇదే నిజమైతే మాత్రం అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి పండగే. ఒకేసారి బావాబామ్మర్దులు చరణ్, అర్జున్‌లు ఏకకాలంలో బాలీవుడ్‌లో గెస్ట్ రోల్స్ చేస్తుండటంతో మెగా ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

More News

Natti Kumar :కొందరికి తెలియదు, కొందరినీ పిలవలేదు.. ఆస్కార్ విజేతలను ఇలాగేనా గౌరవించేది : నట్టి కుమార్ ఆరోపణలు

తెలుగు చిత్ర సీమ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది ఆర్ఆర్ఆర్. టాలీవుడ్‌ కలలో కూడా ఊహించని ఆస్కార్ అవార్డ్‌ని ముద్దాడి దేశానికి కానుక ఇచ్చారు ఎస్ఎస్ రాజమౌళి.

Radhika Apte : హీరోల రెమ్యూనరేషన్‌పై రాధిక ఆప్టే సంచలన వ్యాఖ్యలు

రాధికా ఆప్టే.. ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ అమ్మడు.

Pawan Kalyan:పవన్ చేతికి తాబేలు ఉంగరం గమనించారా.. ఈసారి జనసేనాని జ్యోతిష్యాన్ని నమ్ముకున్నారా..?

పవన్ కల్యాణ్ ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలతో ఫుల్ బిజీ. చేతిలో వున్న సినిమాలను పూర్తి చేసి 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం

Game On:సమ్మర్‌లో ‘గేమ్‌ఆన్‌’

గీతానంద్‌, నేహా సోలంకి జంటగా నటిస్తోన్న చిత్రం ‘గేమ్‌ ఆన్‌’. కస్తూరి క్రియేషన్స్‌ ప్రొడక్షన్‌, గోల్డెన్‌ వింగ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌పై దయానంద్‌ దర్శకత్వంలో

Kiran Kumar Reddy : బీజేపీలో కిరణ్ కుమార్ రెడ్డికి కీలక పదవి.. కర్ణాటక ఎన్నికల బాధ్యతలు కూడా..?

కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కమలనాథులు కీలక బాధ్యతలు  కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.