మాట మీద నిల‌బ‌డే వ్య‌క్తి .. త‌మ‌న్‌: బ‌న్నీ

  • IndiaGlitz, [Saturday,April 11 2020]

బ‌న్నీ ఆనందానికి అవ‌ధులు లేవు. ఎప్ప‌టి నుండో ఎదురు చూసిన సాలిడ్ హిట్‌ను ఈ ఏడాది అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంతో సాధించేశాడు. బ‌న్నీ, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందిన ఈ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను పెంచింది మాత్రం పాట‌లే. త‌మ‌న్ సంగీత సార‌థ్యంలో విడుద‌లైన ప్ర‌తిపాట మ్యూజిక్ ప్రియుల‌ను అల‌రించాయి. సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌, రాములో రాముల‌, బుట్ట‌బొమ్మ సాంగ్స్ అన్నీ వంద మిలియ‌న్ వ్యూస్‌ను సాధించాయి. సినిమాకు అంత మంచి మ్యూజిక్ అందించిన త‌మ‌న్‌కు బ‌న్నీ స్పెష‌ల్ థాంక్స్ చెప్పాడు. ఈ సినిమా ఆల్బ‌మ్ 1.13 బిలియ‌న్ వ్యూస్‌ను సాధించింది. దీనిపై బ‌న్నీ స్పందిస్తూ ‘‘తమన్ నిన్ను చూసి గర్వపడుతున్నాను. ఎందుకంటే నీ మాట‌ను నువ్వు నిల‌బెట్టుకున్నావు. సినిమా ప్రారంభానికి ముందు ‘ఒక బిలియ‌న్ వ్యూస్ ఉండేలా నాకు ఆల్బమ్ చేయాలి’ అని చెబితే నువ్వు ‘సరే బ్రదర్.. ప్రామిస్ చేస్తున్నా’ అన్ని అన్నావు. ఈరోజు ఆల్బమ్‌ను 1.13 బిలియన్ మంది చూశారు. మాట మీద నిలబడే వ్యక్తివి నువ్వు.. ధన్యవాదాలు’’ అని బన్నీ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్‌కు త‌మ‌న్ స్పందిస్తూ ‘‘ఈ ఆల్బ‌మ్ ఇంత పెద్ద హిట్ట‌య్యిందంటే నువ్వు, మ‌న ప్రియ‌మైన ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మే కార‌ణం. ఈ సినిమా ప్ర‌యాణం నా హృద‌యానికి ద‌గ్గ‌రైంది. మీరు నామీద చూపించిన ప్రేమ, న‌మ్మ‌కం వ‌ల్ల‌నే ఇది సాధ్య‌మైంది. అందువ‌ల్లే 100 శాతం మంచి సంగీతాన్ని అందించాను. ఈ ట్వీట్‌ను జీవితాంతం దాచి పెట్టుకుంటాను’’ అన్నారు త‌మ‌న్‌.

More News

ఫేక్ న్యూస్‌పై స్పందించిన మెగాస్టార్‌

మెగాస్టార్ చిరంజీవి త‌ల్లి అంజ‌నా దేవి క‌రోనా వైర‌స్ పోరాటంలో భాగంగా త‌న వంతు సాయం చేస్తున్నార‌ని, అందులోభాగంగా త‌న స్నేహితుల‌తో క‌లిసి 700 మాస్కుల‌ను త‌యారు చేసి

రియ‌ల్ హీరోస్‌కు సెల్యూట్ : వెంక‌టేశ్‌

క‌రోనా మ‌హ‌మ్మారి నుండి ప్ర‌జ‌ల‌ను ర‌క్షించ‌డంలో డాక్ట‌ర్లు, పోలీసులు, ఇత‌ర ఆరోగ్య సిబ్బంది చేస్తున్న కృషి గురించి ఎంత చెప్పినా తక్కువే. అహ‌ర్నిశ‌లు ప్ర‌జ‌ల కోసం క‌ష్ట‌ప‌డుతున్నారు.

అల్లు ఫ్యామిలీ, పవన్‌తో విబేధాలపై చిరు క్లారిటీ

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో ఉన్నా.. రాజకీయాల్లో ఉన్నా.. పెద్ద ఎత్తున వార్తలు నిలుస్తుంటారన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆయన ఫ్యామిలీ విషయాల్లో ఎక్కువగా పుకార్లు షికార్లు చేస్తుంటాయ్.

త్రిష ఒకలా.. మెగాస్టార్ మరోలా.. అసలేం జరిగింది!?

మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ కాంబినేషన్‌లో ‘ఆచార్య’ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. కరోనా ఎఫెక్ట్ లేకపోయుంటే ఈ పాటికే సుమారు సగానికి పైగా సినిమా పూర్తయ్యేది.

తెలంగాణలో అందరూ మాస్క్‌లు వాడాల్సిందే..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రజలు మాస్క్‌లు ధరించడాన్ని