అనిల్‌కు బ‌న్ని ఛాన్స్‌...

  • IndiaGlitz, [Wednesday,October 25 2017]

ప‌టాస్‌, సుప్రీమ్‌, రాజా ది గ్రేట్ చిత్రాల త‌ర్వాత ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఏ సినిమా చేస్తాడ‌నే దానిపై క్లారిటీ లేదు. కొన్ని రోజుల క్రితం అనిల్ రావిపూడి బాల‌య్య సినిమా మొద‌లవుతుంద‌ని కూడా వార్త‌లు వచ్చాయి. అయితే అనిల్ మాత్రం తాను ఏ సినిమా చేయ‌బోతాన‌నే విషయంపై ఇంకా ఓ కొలిక్కి రాలేద‌ని ఇంట‌ర్వ్యూలో తేల్చేశాడు.

కాగా ఇప్పుడు స్ట‌యిలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బ‌న్ని క్యాంప్ నుండి అనిల్‌కు ఫోన్ వ‌చ్చింద‌ట‌. రాజా ది గ్రేట్ సినిమా బావుంద‌ని, ఓ మంచి మెసేజ్‌, క‌మ‌ర్షియ‌ల్ వేల్యూస్‌తో సినిమా క‌థ‌ను సిద్ధం చేసుకుంటే బ‌న్ని డేట్స్ ఇస్తాడ‌ని ఆ ఫోన్ సారాంశమ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం. మ‌రి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.