ఇంటర్వెల్ ఎపిసోడ్ బిజీలో బన్ని...
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్నసినిమా సరైనోడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఇటీవల రాజమండ్రిలో మొయిన్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేసారు. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లో సరైనోడు ఇంటర్వెల్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. ప్రత్యేకంగా వేసిన సెట్ లో అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్, శ్రీకాంత్ లతో పాటు 1000 మంది జూనీయర్ ఆర్టిస్ట్ లు పాల్గొంటున్న ఈ యాక్షన్ ఎపిసోడ్ ను రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి రామ్ లక్ష్మణ్, రవివర్మ, కీచ..ఇలా ముగ్గురు ఫైట్ మాస్టర్స్ వర్క్ చేస్తుండడం విశేషం. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. బన్ని, బోయపాటి వీరిద్దరి స్టైయిల్ లో ఉండే సరైనోడు సినిమా సమ్మర్ లో రిలీజ్ కి రెడీ అవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments