బన్ని - వక్కంతం మూవీ డీటైల్స్..!
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - హరీష్ శంకర్ దర్శకత్వంలో డి.జె. దువ్వాడ జగన్నాథమ్ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత బన్ని తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. తెలుగు, తమిళ్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఇటీవల ప్రారంభించారు. ఇదిలా ఉంటే...ఈ రెండు చిత్రాల తర్వాత బన్ని వక్కంతం వంశీతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
అసలు....వక్కంతం వంశీ ఎన్టీఆర్ తో సినిమా చేయడం కోసం కథ రెడీ చేయడం...కథ విని ఎన్టీఆర్ ఓకే చెప్పడం కూడా జరిగింది. అయితే...ఏమైందో ఏమో కానీ...ఎన్టీఆర్ ప్రస్తుతం వంశీతో సినిమా చేయడానికి ఇంట్రస్ట్ చూపించకపోవడంతో వంశీ బన్నిని కలవడం కథ ఓకే చేయించుకోవడం జరిగింది. బన్ని - వక్కంతం వంశీ కాంబినేషన్లో రూపొందే చిత్రాన్ని లగడపాటి శ్రీధర్ నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com