‘బొమ్మరిల్లు’ భాస్కర్‌కు బన్నీ బంపరాఫర్..!
Send us your feedback to audioarticles@vaarta.com
లవర్ బాయ్ సిద్ధార్థ్, జెనీలియా నటీనటులుగా వచ్చిన ‘బొమ్మరిల్లు’ చిత్రం ఏ రేంజ్లో హిట్టయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమా హిట్టయిన తర్వాత సినిమా తెరకెక్కించిన భాస్కర్ తన ఇంటిపేరునే ‘బొమ్మరిల్లు’గా మార్చేసుకున్నారు. ఆ తర్వాత కూడా ‘పరుగు’, ‘ఆరెంజ్’, ‘ఒంగోలు గిత్త’ సినిమాలు తెరకెక్కించి ఫర్లేదు అనిపించుకున్నారు. ప్రస్తుతం అక్కినేని అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ మూవీ తెరకెక్కించారు. రిలీజ్‌కు ఈ చిత్రం సిద్ధంగా ఉంది.
ఈ సినిమా తర్వాత అల్లు కాంపౌండ్‌లో బిజిబిజీగా గడపాలని భాస్కర్ భావిస్తున్నాడట. ఈ క్రమంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బన్నీకి కథ చెప్పగా.. మొదట తమ్ముడు అల్లు శిరీష్‌కు హిట్టిస్తే కచ్చితంగా మన కాంబోలో మరోసారి సినిమా ఉంటుందని ఆయనకు బంపరాఫర్ ఇచ్చారట. భాస్కర్-బన్నీ కాంబోలో ‘పరుగు’ సినిమా ఫర్లేదు అనిపించుకుంది. ఇప్పటికే బ్రదర్స్ ఇద్దరికీ భాస్కర్ కథ కూడా వినిపించాడట. మొదట శిరీష్ సినిమా పూర్తి చేసి హిట్ చేయాలని బన్నీ చెప్పడంతో కథకు మెరుగులు దిద్దే పనిలో భాస్కర్ నిమగ్నమయ్యాడట. త్వరలోనే కథ పూర్తి చేసుకుని స్టోరీ వినిపిస్తానని శిరీష్‌కు చెప్పాడట.
ఈ సినిమాను గీతా ఆర్ట్స్-02 బ్యానర్‌పై నిర్మించాలని సన్నాహాలు చేస్తున్నారట. అయితే శిరీష్‌తో ఏ రేంజ్ సినిమా తీస్తారో..? ఆ సినిమాను ఏ మేరకు హిట్ చేస్తారో..? బన్నీతో ఛాన్స్ కోసం అయినా కష్టపడి పనిచేసి భాస్కర్ లక్కీ చాన్స్ కొట్టేస్తాడో లేదో వేచి చూడాలి. కాగా ఇటీవలే శిరీష్‌కు ‘విజేత’ దర్శకుడు రాకేశ్ శశి కూడా కథ చెప్పాడని తెలుస్తోంది. మొత్తానికి చూస్తే బన్నీ తన బ్రదర్‌పై దృష్టిపెట్టినట్లు అర్థమవుతోంది. ఈ రెండు సినిమాలు శిరీష్‌కు ఏ మాత్రం కలిసొస్తాయో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com