బన్ని టైటిల్ అదే..ఫస్ట్ షెడ్యూల్ పూర్తి...
Send us your feedback to audioarticles@vaarta.com
రేసుగుర్రం` వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ చేసిన సన్నాఫ్ సత్యమూర్తి` కమర్షియల్ గా పెద్ద సక్సెస్ ను అందుకుంది. తర్వాత వెంటనే సినిమాని స్టార్ట్ చేయకుండా గ్యాప్ తీసుకున్న బన్ని, సింహా, లెజెండ్ వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.
గీతాఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మాతగా సినిమా రూపొందుతోంది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి సరైనోడు` అనే టైటిల్ ను యూనిట్ డిసైడ్ చేసిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. తాజాగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుందట. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com