సమంతకు బన్నీ గిఫ్ట్
- IndiaGlitz, [Monday,July 08 2019]
ఇండస్ట్రీలో ఇప్పుడు మ్యూచువల్ అప్రిషియేషన్ చాలా కామన్ అయిపోయింది. ఎవరి సినిమా బాగా ఉన్నా సరే, వెంటనే మిగిలినవారు దాని గురించి నాలుగు మంచి మాటలు చెప్పడానికి వెనకాడటం లేదు. ఈగోలను పక్కనపెట్టి ఒకరికొకరు ఫ్రెండ్లీగా సపోర్ట్ చేసుకుంటున్నారు. ఈ మధ్య విడుదలైన చిత్రాలను బన్నీ అలాగే ఎంకరేజ్ చేస్తున్నారు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ టీమ్ ను బన్నీ అభినందించారు. తాజాగా సమంతను కూడా ఆయన అభినందించారు. అదీ ఓ ట్వీటుతోనో, ఫోన్ చేసి ఓ మాటతోనో కాదు. ప్రత్యేకంగా ఆమె కోసం గిఫ్ట్ పంపించి మరీ బన్నీ ఆమెను అభినందించారు.
అంతే కాదు.. 'సమంతా నేను ఓ బేబీ చూశాను. ఆ విజయానికి నిన్ను అభినందించాలంటే ఫోన్ కాలు.. పువ్వులు సరిపోవు. అంతకుమించి ఇంకేదైనా ఇవ్వాలి. అందుకే నీలాగే ఎదిగే బోన్సాయ్ను పంపిస్తున్నాను' అని ఓ నోటు కూడా రాశారు. వాటన్నిటినీ సమంత సోషల్ మీడియాలో పెట్టేసింది. అంతే కాదు, బన్నీ నుంచి తనకు అంత మంచి గిఫ్ట్ అందినందుకు క్లౌడ్ నైన్లో ఉంది సమంత. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలంటే ప్రశంసలే కాదు, కాసులు కూడా కురవాలన్నా ఆమె కాంక్ష 'ఓ బేబీ'తో తీరుతోంది.
❤️❤️❤️ https://t.co/PSLsgnwSAM
— Baby Akkineni (@Samanthaprabhu2) July 7, 2019