ఆరు నెలలుగా బన్ని దాన్ని టచ్ చేయలేదు...
- IndiaGlitz, [Wednesday,February 22 2017]
ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం 'డిజె దువ్వాడ జగన్నాథమ్'. ఈ సినిమా ప్రస్తుతం కర్ణాటకలో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ సినిమాలో బన్ని బ్రహ్మణ అబ్బాయిగా కనపడుతున్నాడు. ఈ పాత్ర కోసం బన్ని కాస్తా కష్టపడ్డాడు. ఆరు నెలలుగా మాంసాహారం తీసుకోవడం మానేశాడట. వెజిటేరియన్ ఆహారం మాత్రమే తీసుకున్నాడట. ఈ సినిమాలో బన్ని రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనపడుతున్నాడు. అందులో ఓ షేడ్లో బ్రహ్మణ యువకుడుగా కనపడతాడు. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.