కిక్ బాక్సర్ గా అల్లు అర్జున్ ?

  • IndiaGlitz, [Saturday,November 18 2017]

క్రీడా నేపధ్యంలో చాలా సినిమాలే వచ్చాయి, వస్తున్నాయి. అలా వచ్చిన సినిమాలన్నీ సదరు హీరోలకి, దర్శకులకి హిట్స్ ను అందించాయి. ఇప్పుడు మొదటిసారి స్పోర్ట్స్ నేప‌థ్యంలో అల్లు అర్జున్ కూడా ఒక సినిమా చేయబోతున్నార‌ని ఇండస్ట్రీలో టాక్.

ఇందులో ఆయ‌న కిక్ బాక్సర్ గా క‌నిపించ‌నున్నార‌ని తెలిసింది. ఈ సినిమాని నూత‌న ద‌ర్శ‌కుడు హనురెడ్డి డైరెక్ట్ చేయబోతున్నాడని వినికిడి. కేవలం స్పోర్ట్స్ మూవీగా కాకుండా.. ఒక క‌మ‌ర్షియ‌ల్‌ సినిమాకి కావాల్సిన యాక్షన్, భావోద్వేగాలు, సెంటిమెంట్స్ అన్ని హంగులతో ఈ మూవీని తెరకెక్కించనున్నారు. ఈ డైమెన్షన్స్ అన్నీ నచ్చే బన్నీ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చార‌ని సమాచారం.

బన్నీ ప్రతీ సినిమాలో తన బాడీ లాంగ్వేజ్ ని సినిమాకి కావలసినట్టు మార్చుకుంటారు. అలాగే గతంలో బద్రీనాథ్' సినిమాకు సంబంధించి స్వోర్డ్ ఫైట్ సీన్స్ కోసం కూడా ఇలానే ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నారు.

మరి ఇప్పుడు కిక్ బాక్సర్ గా అవతార‌మెత్త‌నున్న‌ సమయంలో ఎటువంటి శిక్షణ తీసుకుంటాడో వేచి చూడాలి. ప్రస్తుతం నా పేరు సూర్య' సినిమాతో బిజీగా ఉన్న బన్నీ.. ఆ సినిమా తర్వాత ఈ కొత్త ప్రాజెక్ట్ చేస్తాడేమో చూడాలి.