బ‌న్నీ.. అర్హ స‌ర‌దా సంభాష‌ణ‌

  • IndiaGlitz, [Monday,March 02 2020]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త‌న కుమారుడు అయాన్‌, కుమార్తె అర్హ‌ల‌తో ఖాళీ స‌మ‌యాల్లో స‌ర‌దాగా గ‌డుపుతుంటాడు. వారితో స‌ర‌దాగా గ‌డిపిన స‌మయాన్ని వీడియో రూపంలో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. ఇప్పుడు బ‌న్నీతో అర్హ చేసిన అల్ల‌రి వీడియో ఒక‌దాన్ని పోస్ట్ చేశాడు బ‌న్నీ.. ఇప్పుడు ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోలో అర్హ‌ను బ‌న్నీ బే అని పిలిస్తే.. అర్హ కూడా బ‌న్నీని బే అని పిలిచింది.
బ‌న్నీ, అర్హ సర‌దా సంభాష‌ణ ...

బ‌న్నీ: నీ ఫేవ‌రేట్ క‌ల‌రేంటి బే?
అర్హ‌: పింక్ బే
బ‌న్నీ: న‌న్ను బే అంటావా
అర్హ‌: అవును బే
బ‌న్నీ: టు టైమ్స్ బే అంటావే బే
అర్హ‌: అవును బే
బ‌న్నీ: త‌్రీ టైమ్స్ ..సొంత ఫాద‌ర్‌ని, క‌న్న‌తండ్రిని బే అంటావా బే
అర్హ‌: అవును బే
బ‌న్నీ: మ‌ళ్లీ బే.. నీకు భ‌య‌ముండ‌దా బే
అర్హ‌: లేదు బే

ఇలా సాగిన ఈ వీడియో పోస్ట్ చేసిన బ‌న్నీ 'త‌నే నా బే.. ఫాదర్ డాట‌ర్ ల‌వ్‌' అనే మెసేజ్‌ను కూడా పోస్ట్ చేశాడు బ‌న్నీ.

అల వైకుంఠ‌పుర‌ములో సినిమాతో స‌క్సెస్ కొట్టిన బ‌న్నీ త‌దుప‌రి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్నాడు. త్వ‌ర‌లోనే ఈ సినిమా షూటింగ్ కేర‌ళ అడ‌వుల్లో జ‌ర‌గ‌నుంది. ఈ చిత్రంలో రష్మిక మంద‌న్న హీరోయిన్‌.