మ‌ల‌యాళ టైటిల్ చెప్పిన బ‌న్ని

  • IndiaGlitz, [Wednesday,February 07 2018]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు తెలుగులోనే కాదు మలయాళంలో కూడా అభిమానులు ఉన్నారు. అందుకే బన్నీ సినిమాలు మలయాళంలో కూడా అనువదింపబడుతూ ఉంటాయి. ప్ర‌స్తుతం ఆయ‌న న‌టిస్తున్న చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' కూడా మలయాళంలో డబ్ కానుంది. తెలుగుతో పాటు మలయాళంలో కూడా విడుదల కానున్న ఈ సినిమా మలయాళం వెర్షన్ టీజ‌ర్‌ను (ఫ‌స్ట్ ఇంపాక్ట్‌) బుధ‌వారం (ఫిబ్ర‌వ‌రి 7) సాయంత్రం గం.4.30ని.లకు విడుదల చేయబోతున్నట్లు బన్నీ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియ‌జేశారు.

అలాగే ఈ సినిమా పేరుని 'ఎంటే పేరు సూర్య ఎంటే వీడు ఇండియా' అని కూడా ఖరారు చేశారు. ఆర్మీ నేపథ్యంలో సాగే ఈ కథలో బన్నీ సైనికుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం కాశ్మీర్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం -12 డిగ్రీల ఉష్ణోగ్రతలో బన్నీ నిజమైన సైనికుడిలా కష్టపడుతున్నారని చిత్ర యూనిట్ వెల్ల‌డించింది. అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తున్న ఈ మూవీలో సీనియర్ నటులు అర్జున్, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వక్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 27న విడుద‌ల కానుంది.

More News

గాలి ముద్దుకృష్ణమనాయుడు మరణం నా మనసును కలచివేసింది. - డా.మంచు మోహన్ బాబు

తిరుపతిలో చదువుకునే రోజుల్లో నేనూ, ఆయన ఒకే రూమ్ లో  ఉండేవాళ్ళం. ఆయన బ్రదర్ నా క్లాస్ మేట్. నాకు అత్యంత సన్నిహితుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు. ఎలక్షన్స్ టైం లో ఆయన తరపున ఎన్నోసార్లు ప్రచారానికి కూడా వెళ్ళాను.

నితిన్ హీరోయిన్ మారింది

ఇష్క్‌, గుండె జారి గ‌ల్లంత‌య్యిందే వంటి చిత్రాలతో స‌క్సెస్ ట్రాక్‌లోకి వ‌చ్చిన నితిన్ 25వ సినిమాలో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా త‌ర్వాత దిల్‌రాజు నిర్మాత‌గా స‌తీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్క‌బోయే 'శ్రీనివాస క‌ల్యాణం'లో న‌టించ‌బోతున్నాడు.

గాయ‌త్రి కోసం తొలిసారిగా..

ప‌ద‌హారేళ్లుగా క‌థానాయిక‌గా రాణిస్తోంది ఢిల్లీ డాళ్ శ్రియా శ‌ర‌న్‌. గతేడాది గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి చిత్రంలో వ‌శిష్ఠీ దేవిగా అల‌రించిన శ్రియ‌.. ఆ త‌రువాత పైసా వ‌సూల్ చిత్రంలో సంద‌డి చేసింది. ఇక ఈ ఏడాదిలో తొలిగా గాయ‌త్రి చిత్రంతో సంద‌డి చేయ‌నుంది.

తండ్రీకొడుకులు.. భిన్న ఫ‌లితాలు

'మణిశర్మ' ఈ పేరు వింటే చెవుల్లో మెలోడీలు నాట్యమాడుతాయి. ఒకప్పుడు వ‌రుసబెట్టి ఇండస్ట్రీ హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఈ మెలోడీ బ్రహ్మకి గ‌త కొంత‌కాలంగా ఏదీ కలిసిరావడం లేదు. గత సంవత్సరం ఏకంగా 8 సినిమాలకు సంగీతాన్ని అందించినా.. వాటిలో ఒక్క‌టి కూడా సాలిడ్ హిట్ కాలేదు.

అల్లు శిరీష్ విల‌న్ నాగ‌చైత‌న్య చిత్రంలోనూ..

సీనియర్ దర్శకులు దాసరి నారాయణరావు కుమారుడిగా తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టారు దాసరి అరుణ్ కుమార్. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొన్ని సినిమాలు చేసినా...ఇవేవీ కూడా అరుణ్ కుమార్ కెరీర్‌కు ప్లస్ కాలేదు. ఆ తర్వాత చాలా కాలం సినిమాలకి దూరంగానే వున్నారు. తండ్రి మరణం తరువాత.. ఇప్పుడిప్పుడే కోలుకుంటూ మళ్ళీ సినిమాల వైపు దృష్టి సారిస్