పవన్ బాటలో అప్పుడు బన్నీ..ఇప్పుడు సాయి..

  • IndiaGlitz, [Wednesday,August 23 2017]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లో ట‌ర్నింగ్ పాయింట్‌గా నిలిచిన చిత్రం తొలి ప్రేమ‌. ప్రేమ‌క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు ఎ.క‌రుణాక‌ర‌న్ ఈ సినిమాతోనే డైరెక్ట‌ర్‌గా తొలి అడుగులు వేశాడు. ఆ త‌రువాత ప‌వ‌న్‌తో బాలు ని తెర‌కెక్కించాడు. వెనువెంట‌నే అదే ఫ్యామిలీకి చెందిన అల్లు అర్జున్‌తో హ్యాపీ సినిమా చేశాడు. మ‌ళ్లీ ప‌ద‌కొండేళ్ల త‌రువాత అదే కుటుంబానికి చెందిన సాయిధ‌ర‌మ్‌తేజ్‌తో ప్ర‌స్తుతం ఓ సినిమా చేస్తున్నాడు క‌రుణాక‌ర‌న్‌.

విశేష‌మేమిటంటే.. ప‌వ‌న్ హీరోగా న‌టించిన నాలుగో చిత్రం తొలి ప్రేమ అయితే.. బ‌న్నీ హీరోగా న‌టించిన నాలుగో చిత్రం హ్యాపీ. ఇక ప‌వ‌న్ క‌థానాయ‌కుడుగా న‌టించిన ప‌దో చిత్రం బాలు అయితే.. సాయి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ప‌దో చిత్రం క‌రుణాక‌ర‌న్ తెర‌కెక్కిస్తున్న తాజా సినిమా. మొత్తానికి ప‌వ‌న్ బాట‌లోనే బ‌న్నీ, సాయి ప‌య‌నిస్తున్నార‌న్న‌మాట‌.

More News

జీవితాంతం గుర్తు పెట్టుకునే సినిమా - మనోజ్

నేను మీకు తెలుసా సినిమాను తమిళంలో నాన్ ఉనకు తెరియుమా సినిమాతో

శర్వానంద్ కి కూడా అదే ఫార్ములా..

యూత్ ని ఎట్రాక్ట్ చేసే సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపుని తెచ్చుకున్నాడు మారుతి. ఈరోజుల్లో, బస్స్టాప్, కొత్త జంట, భలే భలే మగాడివోయ్ చిత్రాలతో సక్సెస్ఫుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న మారుతికి.. అతని గత చిత్రం బాబు బంగారం ఆశించిన విజయం అందించలేక పోయింది.

నాని హీరోయిన్ సినిమాలు క్యూ కడుతున్నాయి

కృష్ణగాడి వీరప్రేమగాథ.. ఈ సినిమా విడుదలై ఒకటిన్నర సంవత్సరం అయింది. ఈ గ్యాప్ లో ఆ చిత్ర కథానాయకుడు నాని ఇప్పటికే నాలుగు సినిమాలతో సందడి చేశాడు. అయితే ఆ సినిమా హీరోయిన్ మెహ్రీన్ మాత్రం ఇప్పటి వరకు వెండితెరపై దర్శనమివ్వనేలేదు. అలాగని ఖాళీగా ఉందా అంటే.. ఐదు సినిమాలతో బిజీగా ఉంది. వీటిలో నాలుగు తెలుగు సినిమాలు..ఒక తమిళ సినిమా ఉంది.

సెప్టెంబర్ 2న 'వెళ్ళిపోమాకే' చిత్రాన్ని విడుదల చేయనున్న దిల్ రాజు

నూతన చిత్రాలకు,నటీనటులకు,టెక్నిషియన్స్ కు అండగా నిలబడే హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు మరోసారి ఒక యంగ్ టీం కు సపోర్ట్ చేయబోతున్నాడు.యాకూబ్ అలీ దర్శకత్వంలో రూపొందిన ,వెళ్ళిపోమాకే'చిత్రాన్ని దిల్ రాజు విడుదల చేస్తున్నారు.

'జై లవకుశ' ఆడియో డేట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'జైలవకుశ'.