అల్లు అర్జున్, రానాలు నా ప్రయాణాన్ని అద్భుతం చేశారు: అనుష్క
Send us your feedback to audioarticles@vaarta.com
లేడీ ఓరియంటెడ్ మూవీస్‌తో అనుష్క దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ‘అరుంధతి’తో మొదలైన అనుష్క లేడీ ఓరియంటెడ్ మూవీస్ ప్రయాణం.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కాగా.. కాకతీయ రాజ్యాధినేత రాణి రుద్రమదేవి జీవితగాథతో తెరకెక్కిన ‘రుద్రమదేవి’లో టైటిల్ రోల్‌ను అనుష్క పోషించిన విషయం తెలిసిందే. గుణశేఖర్ దర్శక నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 9, 2015న విడుదలైంది. అంటే ఈ సినిమా విడుదలై నేటికి ఐదేళ్లు. ఈ సందర్భంగా గుణశేఖర్ సినిమా సాధించిన అద్భుత విజయంలో భాగస్వాములైన వారందరికీ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
‘రుద్రమదేవి’ సినిమా తెలుగు,తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైంది. భారీ బడ్జెట్‌తో హిస్టారికల్ త్రీడీ మూవీగా సినిమాను గుణశేఖర్ రూపొందించారు. ఈ చిత్రంలో చాళుక్య వీరభద్రుడి పాత్రలో రానా దగ్గుబాటి, గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ నటించాడు. తొలిసారి తెలంగాణ యాసలో మాట్లాడి బన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. రుద్రమదేవి పాత్రలో అనుష్క అద్భుత నటన, గోనగన్నారెడ్డిగా తెలంగాణ యాసలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్స్, రానా ధీరత్వం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలిచాయి.
ఓ కీలక పాత్రలో నిత్యా మీనన్ నటించి మెప్పించింది. ఈ సినిమాలోని సాంకేతిక అంశాలకు మంచి ఆదరణ లభించింది. ఇళయరాజా సంగీతం ఈ చిత్రాన్ని మరో మెట్టు ఎక్కించింది. అయితే ఈ చిత్రం విడుదలై ఐదేళ్లవుతున్న సందర్భంగా అనుష్క కూడా ట్విట్టర్ ద్వారా తన స్పందనను తెలియజేసింది "రుద్రమదేవి ప్రయాణం నాకెంతో స్పెషల్. అల్లుఅర్జున్, రానా దగ్గుబాటి ఈ ప్రయాణాన్ని ఇంకా అద్భుతంగా మలిచారు. ఈ గొప్ప చరిత్రను వెండితెరపై ఆవిష్కరించిన గుణశేఖర్, ఆయన టీమ్‌కు నా ప్రత్యేక ధన్యవాదాలు" అని అనుష్క ట్వీట్ చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments