AAA:అల్లు అర్జున్ థియేటర్లో వరల్డ్ క్లాస్ ఫీచర్స్ : అబ్బురపరిచే స్క్రీన్స్, సీటింగ్, సౌండ్.. వివరాలివే
Send us your feedback to audioarticles@vaarta.com
దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లుగా మన స్టార్ హీరోలు.. ఓ వైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు వ్యాపారాలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరు స్టార్స్ ఇప్పుడు ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. మన తెలుగు చిత్ర పరిశ్రమ విషయానికి వస్తే.. సీనియర్ హీరోలు, కుర్ర హీరోలకు సొంతంగా బిజినెస్‌లు వున్నాయి. అయితే నాగార్జున, మహేశ్ బాబులు ఈ విషయంలో బాగా సక్సెస్ కావడంతో పాటు మిగిలిన వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రధానంగా తమకు బాగా తెలిసిన థియేటర్ బిజినెస్‌లోకి స్టార్స్ దిగుతున్నారు. ఇప్పటికే ఏషియన్ సినిమాస్‌తో కలిసి మహేశ్ బాబు ‘ఏఎంబీ’ మాల్‌ను నిర్మించగా.. విజయ్ దేవరకొండ ‘ఏవీడీ’ నిర్మించారు. ప్రభాస్ తన స్నేహితులతో కలిసి ఓ థియేటర్‌ను ప్రారంభించాడు. తాజాగా ఈ లిస్ట్‌లోకి స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ చేరారు.
ఆదిపురుష్‌తో ప్రారంభంకానున్న అల్లు అర్జున్ సినిమాస్ :
దీనిలో భాగంగా హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని ఫేమస్ థియేటర్ సత్యంకు ఆధునిక హంగులు దిద్ది.. ఏషియన్ అల్లు అర్జున్ సినిమాస్ పేరుతో భారీ మల్టీప్లెక్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. బుధవారం ఈ థియేటర్‌ను లాంఛనంగా ప్రారంభించారు బన్నీ. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నిర్మాత అల్లు అరవింద్ పాల్గొన్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ చిత్రంతో ఈ థియేటర్ ప్రారంభంకానుంది. నేటీ తరానికి తగినట్లుగా ఆధునిక హంగులను ఈ థియేటర్‌కు సమకూర్చారు. అవేంటో ఒకసారి చూస్తే..
67 అడుగుల ఎత్తైన తెర :
ఏషియన్ అల్లు అర్జున్ సినిమాస్ మల్టీప్లెక్స్‌లో అల్లు అర్జున్, ఏషియన్ సునీల్, భరత్ నారంగ్, మురళీ మోహన్, సదానంద్ గౌడ్ భాగస్వాములుగా వున్నారు. దాదాపు 3 లక్షల చదరపు అడుగుల్లో రూపొందిన ఈ మాల్లో 3 ఫ్లోర్ల పార్కింగ్, ఏఏఏ ఫుడ్ కోర్ట్ థర్డ్ ఫ్లోర్లో, ఏఏఏ సినిమాస్ ఫోర్త్ ఫ్లోర్లో వుంటాయి. ఏఏఏ సినిమాస్‌లో మొత్తం ఐదు స్క్రీన్లు వున్నాయి. ఇందులో మొదటి స్క్రీన్ 67 అడుగుల ఎత్తు వుంటుందట. దీనిలో బార్కో లేజర్ ప్రొజెక్షన్, అట్మాస్ సౌండ్ వంటి ఫీచర్లు ఏర్పాటు చేశారు. స్క్రీన్ 2లో ఎపిక్ లక్సాన్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. దీనికి కూడా అట్మాస్ సౌండ్ ఫీచర్‌ను యాడ్ చేశారు. మిగిలిన స్క్రీన్లు మాత్రం 4కే ప్రొజెక్షన్‌తో, డాల్బీ 7.1 సౌండ్ సిస్టమ్‌తో ఏర్పాటు చేశారు. అన్ని స్క్రీన్లలోనూ విజువల్ ఫోకస్, డ్రమెటిక్ ఎఫెక్ట్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని నిర్వాహకులు అంటున్నారు. ఇక సీటింగ్ విషయానికి వస్తే.. ఫస్ట్ స్క్రీన్‌లో 440 సీట్లు, సెకండ్ స్క్రీన్‌లో 172 సాధారణ సీట్లు, 15 రిక్లయినర్స్.. థర్డ్ స్క్రీన్‌లో 304 సాధారణ సీట్లు , 18 రిక్లయినర్స్.. ఫోర్త్ స్క్రీన్‌లో 123 సాధారణ సీట్లు, 11 రిక్లయినర్స్.. ఫిఫ్త్ స్క్రీన్‌లో 287 సాధారణ సీట్లు, 17 రిక్లయినర్స్ వున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments