బన్నీ కొత్త సినిమా టైటిల్ ఇదేనా ?
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ నెలలో షూటింగ్ ప్రారంభం కావాల్సింది. అయితే కాలేదు. అందుకు కారణం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా వైరస్. దీంతో ముందు కేరళలో అనుకున్న షూటింగ్ గోదావరి జిల్లాల్లో అనుకున్నారు. తీరా ఇప్పుడు ఆలస్యంగా సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. కాగా.. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రేపు బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేస్తున్నారు.
దీనికి సంబంధించిన వార్తొకటి సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది. అదేంటంటే..ఈ సినిమా టైటిల్‌గా పుష్ప అని పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. సినిమాలో బన్నీ పేరు పుష్పక్ నారాయణ్. దాంట్లో నుండే టైటిల్‌ను ఖరారు చేశారని టాక్. ఆర్య, ఆర్య2 చిత్రాల తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం కావడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. శేషాచలం అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ సినిమాను తెరకెక్కించబోతున్నాడట. ఈ సినిమా కోసం బన్నీ చిత్తూరు జిల్లా యాసను నేర్చుకున్నాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com