వేడుకలను ఆపేసిన బన్నీ.. ఏం చేశాడో తెలుసా?
Send us your feedback to audioarticles@vaarta.com
చాలా పెద్ద హిట్ కోసం వెయిట్ చేసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కోరిక ఈ ఏడాది తీరిపోయింది. బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అల వైకుంఠపురములో బన్నీ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీగా నిలిచింది. ఈ సినిమా సక్సెస్‌ను బన్నీ వీలైన ప్రతి సందర్భంలోనూ బలంగానే సెలబ్రేట్ చేసుకున్నాడు. అంతే కాకుండా ఈ ఏడాది బన్నీ హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేసి 17 సంవత్సరాలు పూర్తయ్యాయి. దీన్ని బన్నీ తండ్రి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలని అనుకున్నాడు. అందుకోసం బన్నీతో సినిమాలు చేసిన దర్శకులు, నిర్మాతలకు ఆహ్వానం పంపారు కూడా. అయితే ఇప్పుడు కరోనా ప్రభావంతో సినిమా షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ సందర్భంలో వేడుకలు అంటే బావుండవని.. బన్నీ 17 ఇయర్స్ సెలబ్రేషన్స్‌ను క్యాన్సిల్ చేసేశారు.
అయితే బన్నీ తన 17 ఇయర్స్ ఆప్ కెరీర్ సెలబ్రేషన్స్‌ను ఆపలేదట. అయితే అందరితో కాదట. తన కుమారుడు అయాన్, కూతురు అర్హతో కలసి బన్నీ కేక్ కటింగ్ చేసుకుని సెలబ్రేషన్స్ చేసుకున్నాడట. ఆ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments