అల్లు అర్జున్ 1 - స‌మంత 3..!

  • IndiaGlitz, [Saturday,November 12 2016]

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కి తెలుగుతో పాటు మ‌ల‌యాళంలో ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. తెలుగు, మ‌ల‌యాళంతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ ప్రేక్ష‌కుల‌ను కూడా ఆక‌ట్టుకుని సౌత్ లో భారీ క్రేజ్ ఏర్ప‌రుచుకునేందుకు బ‌న్ని ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఈ విష‌యాన్ని స‌రైనోడు ప్ర‌మోష‌న్స్ లో భాగంగా బెంగుళూరులో అల్లు అర్జునే స్వ‌యంగా చెప్పారు.

ఇదిలా ఉంటే....ట్విట్ట‌ర్ లో అల్లు అర్జున్ చేరిన త‌క్కువ టైమ్ లోనే 1 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ సంపాదించుకోవ‌డం విశేషం. అలాగే ఏమాయ చేసావే చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన అందాల తార స‌మంత‌. ఈ ముద్దుగుమ్మ కూడా ఒక్క తెలుగులోనే కాకుండా సౌత్ లో మంచి క్రేజ్ ఏర్ప‌రుచుకుంది. సోష‌ల్ మీడియాలో బాగా ఏక్టీవ్ గా ఉండే స‌మంతకు ట్విట్ట‌ర్ లో 3 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ ఉండ‌డం విశేషం. ఈ సంద‌ర్భంగా స‌మంత ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ...ఐ ల‌వ్ మై 3 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ అంటూ త‌న సంతోషాన్ని షేర్ చేసుకుంది. ఈరోజే అల్లు అర్జున్ 1 మిలియ‌న్, స‌మంత 3 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ ను క్రాస్ చేయ‌డం విశేషం..!