విజయ్ దేవరకొండ అగ్రశ్రేణి హీరోగా ఎదుగుతాడు - అల్లు అరవింద్

  • IndiaGlitz, [Monday,August 13 2018]

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన చిత్రం గీత గోవిందం. పరశురాం (బుజ్జి) దర్శకుడు. ప్రొడ్యూస‌ర్ బ‌న్నివాసు నిర్మాణంలో అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో GA2 PICTURES బ్యాన‌ర్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి గోపి సుంద‌ర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని అగ‌ష్టు 15న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నారు. ఈ సందర్భంగా వైజాగ్ లో గీత గోవిందం ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఆంధ్రప్రదేశ్ మంత్రి శ్రీ ఘంటా శ్రీనివాస రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ సందర్బంగా చిత్ర స‌మ‌ర్ప‌కులు శ్రీఅల్లు అర‌వింద్ గారు మాట్లాడూతూ.. గీత గోవిందం చిత్రంలోని కొన్ని క్లిప్పింగ్స్ బయటికి వచ్చాయి. సర్వీస్ ప్రొవైడర్ చేతగానితనం వల్ల బయటికి వచ్చాయి. ఆ క్లిప్పింగ్స్ ని గుంటూరులో ఉన్న స్టూడెంట్స్ షేర్ చేశారు. ఈ రోజు 17 మంది స్టూడెంట్స్ ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఫ్రెండ్లీగా షేర్ చేస్తున్నామని అనుకున్నారు. తెలియక చేసినా తప్పు తప్పే. జరిగిన తప్పును విచారిస్తున్నాం. యాక్షన్ తీసుకుంటాం.

వైజాగ్ లోని ఓ కాలేజ్ కి కూడా పోలీసులు వెళ్లారు. పరిస్థితి ఇదివరకు లాగా లేదు. విజయదేవరకొండ ఫ్యాన్స్ చేతుల్లో తన్నులు తినొద్దు. ఐపీ అడ్రస్ ఆధారంగా పట్టుకోవచ్చు. ఇండస్ట్రీ కూడా సిగ్గు పడాల్సిన విషయం. బయటికి వచ్చిన క్లిప్పింగ్స్ వల్ల నష్టం లేదు. రెండు రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుంది. కానీ రాబోయే పెద్ద సినిమాల గురించే నా బాధంతా. చిన్న పొరపాటుకి మీరు మీ ఫ్యామిలీస్ బాధపడతాయని చెబుతున్నాను. నేను ఈ సినిమా చూశాను. మాకు ప్రత్యేకమైన కొలమానాలుంటాయి.

ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతోందో మేము ఊహించుకోగలం. డైరెక్టర్ చాలా కావాల్సిన వాడు. ఆయన దీని తర్వాత కూడా మా బ్యానర్లో ఇంకో సినిమా చేయబోతున్నాడు. మా సంస్థ ద్వారా 3వ సినిమా చేయబోతున్నాడంటే అర్థం చేసుకోవచ్చు. విజయ్ దేవరకొండ లైఫ్ స్టైల్ లో నాకు వంద సినిమాలు కనిపిస్తున్నాయి. వర్సటైల్ నటుడు. అగ్రశ్రేణి హీరోల జాబితాలో నిల్చోబోతున్న నటుడు. రష్మిక కోసం మేం మూడు నెలలు ఆపేశాం. డైరెక్టర్ ఈమెనే కావాలి అంటే.. తప్పలేదు.

తన క్యారెక్టర్ ని చించేసింది. విజయ్ దేవరకొండతో పోటీపడి నటించడమంటే మాములు విషయం కాదు. నాకు వైజాగ్ లో ఘంటా శ్రీనివాస్ కంటే ఆప్తుడు ఎవరూ లేరు. ఈ ఊర్లో ఏ ఫంక్షన్ జరిగినా ఆయన లేకుండా ఫంక్షన్ చేయను. ఇక్కడికి రాని బన్నీ వాసు గురించి చెప్పాలి. మేము చెప్పిందంతా ఎగ్జిక్యూట్ చేసేది బన్ని వాసు. అతని తరపును చెబుతున్నాను. హీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ జెమ్. మా కెమెరా మెన్ విజువల్ ఫీస్ట్ అందించాడు. గోపి సుందర్ మిలియన్ హిట్స్ అందించాడు. సౌత్ ఇండియాలో షార్ట్ టైంలో ఇంకేం ఇంకే కావాలి రికార్డ్ వ్యూస్ సంపాదించింది. అందరికీ ఆల్ ది బెస్ట్. అని అన్నారు.

ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్‌ (బుజ్జి) మాట్లాడుతూ.. నేను వైజాగ్ లోకల్. ఈ ఫంక్షన్ ఇక్కడ జరగడం చాలా హ్యాపీగా ఉంది. ఆగస్ట్ 15న రిలీజ్ అవుతోంది. పాటలు సూపర్ హిట్ చేశారు. విజయ్, రష్మిక ప్రాణం పోశారు. అరవింద్ గారు, బన్ని వాసుగారు నా టెక్నీషియన్స్ అందరికీ చాలా చాలా థాంక్స్. అని అన్నారు.

రష్మిక మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. ఆగస్ట్ 15న గీత గోవిందం రిలీజ్ అవుతోంది. ఎలాంటి టెన్షన్స్ లేకుండా సినిమాను ఎంజాయ్ చేయండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చాలా చాలా థాంక్స్. అని అన్నారు.

మంత్రి ఘంటా శ్రినివాస రావు మాట్లాడుతూ... గీత గోవిందం ఫంక్షన్ వైజాగ్ లో పెట్టడం చాలా సంతోషం. వైజాగ్ లో ప్రీ రిలీజ్ పంక్షన్ పెడితే సూపర్ డూపర్ హిట్ అవుతుందని అరవింద్ గారికి నమ్మకం. సరైనోడు ఫంక్షన్ కూడా ఇక్కడే చేశారు. సక్సెస్ మీట్ కూడా ఇక్కడే పెట్టాలని కోరుతున్నాను. ఈ సినిమా స్పెషాలిటీ ఏంటి అని అరవింద్ గారిని అడిగితే... ఈ మధ్య వచ్చిన హీరోల్లో ఇంత వెర్సటైల్ ఆర్టిస్ట్ ని చూడలేదన్నారు రాబోయే 15 సంవత్సరాల్లో డిఫరెంట్ సినిమాలు ఆయన నుంచి వస్తాయన్నారు.

డైరెక్టర్ కి హీరోయిన్ కి టెక్నీషియన్స్ కి ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. వైజాగ్ సినిమా హబ్ గా మారనుంది. వైజాగ్ లో షూటింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వైజాగ్ లో స్టూడియో పెట్టాలని అరవింద్ గారిని కోరుతున్నాను. బన్నీకి కూడా ఇంట్రస్ట్ ఉంది అన్నాడు. ప్రభుత్వం తరపున అన్నిరకాలుగా సహకరిస్తాం. అని అన్నారు.

విజయ్ దేవర కొండ మాట్లాడుతూ... గతంలో వైజాగ్ లో ఈవెంట్ చేద్దామని ప్లాన్ చేశాను కుదరలేదు. ఈ సినిమా ఫంక్షన్ మాత్రం వైజాగ్ లోనే చేయాలని పట్టుపట్టాను. నాకు మీరు మాత్రం ప్రేమను అందిస్తూనే ఉన్నారు. పైరసీ వల్ల రెండు మూడు రోజుల నుంచి మూడ్ పోయింది. అరవింద్ గారు, బన్ని వాసు గారు పైకి నవ్వుతూ కనిపిస్తున్నా... వెనకాల ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. మేము సినిమా చేయాలి గాని లింకులు తీసే పరిస్థితి రాకూడదు. చిన్నప్పటి నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నాం. పైరసీ తో కిందికి లాగే బ్యాచ్ కి చెప్పాలనుకున్నది ఒక్కటే. నేను ఎలాగైనా నాకు కావాల్సింది సాధిస్తా. మీరు ఏమైనా చేయండి. నేను నా కేరీర్ మీద చాలా ఫోకస్ పెట్టాను.

మా అడియెన్స్ ని, ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చేయడానికి ఎంతైనా కష్టపడతా. గీత గోవిందం ఆగస్ట్ 15న థియేటర్స్ లో వస్తోంది. నేను థియేటర్ కి వన్ ఇయర్ తర్వాత వస్తున్నా. నాకు ఈ సినిమా మీద గట్టిగా నమ్మకం ఉంది. థియేటర్ నవ్వులతో నిండిపోతుంది. బుజ్జి గారికి ఓ డైలాగ్ స్టైల్ ఉంది. నాకు కంటి సర్జరీ అయినా సరే... రిలీజ్ కు వారం రోజులే టైం ఉన్నా డబ్బింగ్ చెప్పాను. బుజ్జి గారు ఎంత కష్టపడ్డారో.. ఎన్ని రాత్రులు నిద్రలేకుండా ఉన్నారో నాకు. ఆయనకు డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. రష్మిక ఈ రోల్ కి ఎంత హార్డ్ వర్క్ చేసిందో నాకు తెలుసు. అరివింద్ గారు, వాసు గారు... ఖర్చు ఎంతైనా పర్లేదు.

థియేటర్ కు వెళ్లి చూసే వాళ్లు ఎంజాయ్ చేయాలని క్వాలిటీ కోసం రీ షూట్స్ చేయించేవారు. బన్నీ వాసు గారు ఈ ఫంక్షన్ కి రాలేకపోయారు. ప్రొడ్యూసర్ తాను నిర్మించిన సినిమా ఫంక్షన్ కు కూడా రాలేని పరిస్థితి లో ఉన్నాడు.... పైరసీ వల్ల. నేను ఎన్ని మాటలైనా పడతాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్లీ ఆ ఎనర్జీ వస్తుంది. మీరు ఫుల్ ఎజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. ఆంధ్రా యూనివర్శిటీకి చాలా చాలా థాంక్స్. వైజాగ్ రావాలనుకున్న కోరిక తీరింది. అని అన్నారు.

More News

సెప్టెంబ‌ర్‌లో 'సామి స్క్వేర్‌'

'సామి'.. తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో ఇది ఒకటి. 2003లో హరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా విక్రమ్ నట విశ్వరూపం చూపించారు.

'మ‌హాన‌టి'కి అవార్డ్‌

అల‌నాటి మ‌హాన‌టి సావిత్రి జీవిత క‌థ‌ను ఆధారంగా చేసుకుని తెర‌కెక్కిన బయోపిక్ 'మ‌హాన‌టి'. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో స్వ‌ప్న సినిమాస్ బ్యాన‌ర్‌పై ప్రియాంక ద‌త్, స్వ‌ప్న ద‌త్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

చ‌ర‌ణ్‌తో మ‌రో హిట్ కోసం..

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్‌లో 2014లో ఎవ‌డు సినిమా రూపొందింది. ఇందులో బ‌న్ని కూడా గెస్ట్ రోల్‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే.

త‌మిళంలో బ‌న్ని మ‌రో ప్ర‌య‌త్నం...

తెలుగువాడైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చెన్నైలో పుట్టి పెరిగాడు. త‌మిళంపై మంచి క‌మాండ్ కూడా ఉంది. హీరోగా బ‌న్నికి తెలుగులో మంచి మార్కెట్ ఉంది.

పెళ్లి చేసుకుంటున్న స్వాతి...

క‌ల‌ర్స్ ప్రోగ్రామ్‌తో క‌ల‌ర్స్ స్వాతిగా పేరు తెచ్చుకుని.. చ‌లాకీగా అంద‌రి హృద‌యాల్లో స్థానం సంపాదించుకున్న స్వాతి త‌ర్వాత డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా బిజీగా అయింది.