నాని ఈ తరం హీరోల్లో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్ - అల్లు అరవింద్

  • IndiaGlitz, [Wednesday,September 09 2015]

సినిమా హిట్ అవుతుందని తెలుసు కానీ ఇంత పెద్ద హిట్టవుతుందని తెలియదని అన్నాడు హీరో నాని అల్లు అరవింద్‌ సమర్పణలో జి.ఎ 2, యు.వి.క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై నాని, లావణ్య త్రిపాఠి జంటగా రూపొందిన చిత్రం 'భలే భలే మగాడివోయ్‌'. మారుతి దర్శకుడు. బన్నివాస్‌ నిర్మాత. ఇటీవల విడుదలైన ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా ఈ చిత్రయూనిట్‌ మంగళవారం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా నాని మాట్లాడాడు. ఇంకా మాట్లాడుతూ ఇండస్ట్రీలోకి నేను వస్తుంటే నీకెవరు సపోర్ట్ లేరని కొంత మంది అన్నారు. ఇంత మంచి టీమ్, దర్శకుడు, సినిమా ఉంటే అంత కంటే గొప్ప సపోర్ట్ ఏం కావాలి. మేం బి.బి.ఎం ని భలే భలే మగాడివోయ్ అనుకుంటే ప్రేక్షకులు మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ చేశారు. ప్రతి సినిమా చేస్తున్నప్పుడు చిన్నపాటి టెన్షన్ మనసులో ఉండేది. కానీ ఈ సినిమా చేస్తున్నప్పుడు చాలా కూల్ గా చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇంత మంచి సినిమాని నాకు ఇచ్చిన అల్లుఅరవింద్ గారికి, మారుతికి, వంశీగారికి థాంక్స్ అన్నారు

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ '' నాని ఈ జనరేషన్‌ హీరోల్లో వన్‌ ఆఫ్‌ ది ఫైనెస్ట్‌ యాక్టర్‌. తనకి సినిమా బాగుండాలి. తను చేసిన కామెడిని మారుతి కథ చెప్పిన దాని కంటే సినిమా చూసినప్పుడు బాగా ఎంజాయ్‌ చేశాను. నాని సినిమా బాగుండాలని కోరుకునే వ్యక్తి. అందుకోసం తను అద్భుతంగా నటించిన నాలుగున్నర నిమిషాల సన్నివేశాన్ని కూడా ఎడిట్ చేయడానికి యాక్సెప్ట్ చేశాడు. అది తనకి సినిమా పట్ల ఉన్న కమిట్ మెంట్. మారుతి ఈ సినిమాతో తన సెకండ్‌ లెవల్‌లో ఫస్ట్‌ సక్సెస్‌ అందుకున్నాడు. లావణ్య చక్కగా నటించింది. తన నటన నచ్చడంతో అల్లు శిరీష్‌ సినిమాలో కూడా హీరోయిన్‌గా ఎంపికచేశాం. అలాగే ప్రకాష్‌ రాజ్‌ స్థానాన్ని కొన్ని సినిమాల్లో భర్తీ చేసేలా మురళీశర్మ బ్యాలెన్స్ డ్‌గా నటించాడు. నిర్మాత వంశీ నన్ను పార్ట్‌నర్ గా భరించాడు. మంచి నిర్మాత. ఎంటైర్‌ టీమ్‌ సినిమాని పెద్ద సక్సెస్‌ చేయడంలో బాగా కష్టపడింది'' అన్నారు.

మారుతి మాట్లాడుతూ ''నా హోమ్‌ బ్యానర్‌లాంటి గీతాఆర్ట్స్ లో నేను డైరెక్ట్‌ చేసిన కొత్త జంట అనుకున్న స్థాయిలో పెద్ద హిట్‌ కాలేదు. ఓ హిట్‌ చేయాలని అనుకునేవాడిని. ఎలాగైనా హిట్‌ కొట్టిన గర్వంతో అడుగు పెట్టాలనే ఆలోచనతో ఉన్న నాకు ఈ సినిమా ఆ వెలితిని తీర్చేసింది. ఓ మీడియం బడ్జెట్‌ మూవీ యు.ఎస్‌లో వన్‌ మిలియన్‌ డాలర్స్‌ కలెక్ట్‌ చేయడం చాలా గొప్ప విషయం. నాకు గౌరవాన్ని తెచ్చిపెట్టిన సినిమా ఇది. నాని హీరోగానే కాకుండా ముఖ్యమైన సలహాలు కూడా ఇచ్చి నన్ను ముందుకు నడిపించాడు. కొన్ని సినిమా సక్సెస్‌ కావడంలో ముఖ్యపాత్ర పోషించాడు. ఇంత మంచి విజయాన్ని నాకు అందించిన ప్రేక్షకులకు, నా టీమ్‌కి థాంక్స్‌'' అన్నారు.

బన్నివాస్‌ మాట్లాడుతూ ''ఈరోజుల్లో సినిమా షూటింగ్‌ టైమ్‌లో సినిమా చూసి ఇదేం హిట్టవుతుందనుకున్నాను. కానీ సినిమా పెద్ద హిట్టయింది. ఒక మనిషి గురించి తక్కువ అంచనా వేశానని అప్పుడు అనుకున్నాను. తన సినిమాలను నేను జడ్జ్‌ చేయలేను. సపోర్ట్‌ చేసిన నిర్మాతలకు థాంక్స్‌'' అన్నారు.

సుధీర్ బాబు మాట్లాడుతూ 'నాకు ప్రేమకథాచిత్రమ్ లాంటి బ్రేక్ ఇచ్చిన మారుతి ఈ సినిమాతో నా తనయుడు చరిత్ కి కూడా మంచి బ్రేక్ ఇచ్చాడు. అందుకు నాకు సంతోషంగా ఉంది'' అన్నారు.

ఈ కార్యక్రమంలో లావణ్య త్రిపాఠి, మధుమిత, శివబాలాజీ, నరేష్‌, ఎస్‌.కె.ఎన్‌, యు.వి.క్రియేషన్స్‌ వంశీ తదితరులు పాల్గొన్నారు.

More News