ఖైదీ నెం 150 ఫస్ట డే గ్రాస్ 47 కోట్ల 7 లక్షలు - అల్లు అరవింద్..!

  • IndiaGlitz, [Thursday,January 12 2017]

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన 150వ చిత్రం ఖైదీ నెం 150. డైన‌మిక్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ తెర‌కెక్కించిన ఖైదీ నెం 150 ప్ర‌పంచ వ్యాప్తంగా నిన్న రిలీజైంది. అన్ని ఏరియాల నుంచి అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ మాట్లాడుతూ...చిరంజీవి గారు ప‌ది సంవ‌త్స‌రాల గ్యాప్ త‌రువాత న‌టించిన ఖైదీ నెం 150 చిత్రానికి మేము ఊహించిన దానికంటే ఎక్కువ స్పంద‌న వ‌చ్చింది.
దాదాపు 2,000 థియేట‌ర్స్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసాం. థియేట‌ర్స్ కు ప్రేక్ష‌కుల విప‌రీతంగా రావ‌డం చూస్తుంటే పండ‌గ మూడు రోజులు ముందుగానే వ‌చ్చిన‌ట్టుగా అనిపిస్తుంది. ఇక ఖైదీ నెం 150 క‌లెక్ష‌న్స్ విష‌యానికి వ‌స్తే... ఫ‌స్ట్ డే అత్య‌ధికంగా 47 కోట్ల 7 ల‌క్ష‌లు వ‌సూలు చేసి సంచ‌ల‌నం సృష్టించింది. ఈ గొప్ప విష‌యాన్ని చిరంజీవి గారితో పాటు ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రితో పంచుకోవ‌డం చాలా సంతోషంగా ఉంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌లో 30 కోట్ల 45 ల‌క్ష‌లు, క‌ర్నాట‌క‌లో 4 కోట్లు 70 ల‌క్ష‌లు, ఒరిస్సా లో 12 ల‌క్ష‌లు, త‌మిళ‌నాడులో 20 ల‌క్ష‌లు, రెస్టాఫ్ ఇండియాలో 58 ల‌క్ష‌లు, యు.ఎస్ లో 1.22 మిలియ‌న్ డాల‌ర్లు, నార్త్ అమెరికాలో 3.20,000 డాల‌ర్లు వ‌సూలు చేసింది.
మొత్తం 47 కోట్ల 7 ల‌క్ష‌లు ఫ‌స్ట్ డే వ‌సూలు చేసి స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. చిరంజీవి గారి 151వ చిత్రాన్ని బోయ‌పాటి డైరెక్ష‌న్ లో గీతా ఆర్ట్స్ లో నిర్మించాలి అనుకున్నాం. క‌థ సుమారు రెడీ అయ్యింది. ఇంకా స్ర్కిప్ట్ పై వ‌ర్క్ చేయాలి. అయితే...బోయ‌పాటి శ్రీను వేరే సినిమాలో బిజీలో ఉండ‌డం వ‌ల‌న లేట్ అవుతుంది. అందుచేత ఈ చిత్రాన్ని 152వ సినిమాగా చేయ‌బోతున్నాం. 151వ చిత్రం సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఉండ‌చ్చు అన్నారు.