Nene Vasthunna: కలై పులి ఎస్ థాను, గీతా ఆర్ట్స్ సమర్పణలో ధనుష్, సెల్వరాఘవన్ లా 'నేనే వస్తున్నా' చిత్రం

తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం తన సోదరుడు మరియు విలక్షన దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో నానే వరువేన్ చిత్రాన్ని చేసిన విషయం విదితమే. తాజాగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం, పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటూ, విడుదలకు సిద్దమవుతుంది.

“కాదల్ కొండేన్”, “పుదుపేట్టై”, “మయక్కం ఎన్న” తర్వాత ధనుష్ మరియు సెల్వరాఘవన్ కలయికలో వస్తున్న నాల్గవ చిత్రం ఇది. యోగి బాబు, ఇందుజా రవిచంద్రన్ మరియు ఎల్లి అవ్రామ్ కూడా ఈ చిత్రంలో నటించారు.

కలై పులి ఎస్ తను నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ. నానే వరువేన్ చిత్రం తెలుగులో నేనే వస్తున్నా పేరుతో రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ప్రెసెంట్ చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించింది.ఈ సంధర్బంగా కలై పులి ఎస్ థాను, గీతా ఆర్ట్స్ అధినేత, ప్రముఖ నిర్మాత అయిన అల్లు అరవింద్ ను కలిసారు. నేనే వస్తున్నా చిత్రం సెప్టెంబర్ నెలలోనే విడుదలకానుంది.

నటీనటులు: ధనుష్, ఎల్లి అవ్రామ్, ఇందుజా రవిచంద్రన్, యోగిబాబు మరియు యోగిబాబు

More News

రేవంత్ విజయాన్ని అడ్డుకున్న ఫైమా... కెప్టెన్సీ ఛాన్స్ మళ్లీ మిస్

బిగ్‌బాస్ 6 సీజన్ ప్రజలకు కావాల్సినంత వినోదాన్ని పంచుతోంది. గతంలో నాలుగైదు వారాలు గడిచిన తర్వాత షో ట్రాక్ ఎక్కేది.

Nagashaurya: నాగశౌర్య ‘కృష్ణ వ్రింద విహారి' టీమ్ పాదయాత్ర

వెర్సటైల్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై

Shree Karthik: 'ఒకే ఒక జీవితం' విజయం.. నా బరువుని దించేసింది : దర్శకుడు శ్రీకార్తిక్

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో శర్వానంద్ 30వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఒకే ఒక జీవితం.

విజయ్‌ దేవరకొండపై దుష్ప్రచారం.. ఎదుగుతున్న హీరోని తొక్కాలనుకోవడం సహజమే : ఆర్జీవీ సంచలనం

విజయ్ దేవరకొండ... స్వయంకృషితో, తనదైన నటనతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్ ఎదిగిన హీరో .

BiggBoss: ఈ వారం నామినేషన్‌లో ఎనిమిది మంది.. అందరి టార్గెట్ ‘గీతూ’నే

బిగ్‌బాస్ 6 తొలివారమే వేడి పుట్టించింది. గలాటా గీతూ, రేవంత్, మెరీనా- రోహిత్‌ల పర్మార్మెన్స్‌కి తోడు సీపీఐ జాతీయ నేత నారాయణ వ్యాఖ్యలతో