బన్ని బాగానే ఉన్నాడంటున్న అల్లు అరవింద్..
- IndiaGlitz, [Tuesday,September 08 2015]
బన్నికి యాక్సిడెంట్ అయ్యింది. ఇది టుడే లేటెస్ట్ పుకారు. ఇంకేముంది బన్నికి యాక్సిడెంట్ జరిగిందట అంటూ న్యూస్ ఛానల్స్ లో ఒకటే హడావిడి. దీంతో బన్ని ఫాదర్ అల్లు అరవింద్ ఈ విషయం పై మీడియాతో మాట్లాడారు. బన్ని భార్య స్నేహురెడ్డి కి గతంలో జరిగిన యాక్సిడెంట్ లో కాళికి ఆపరేషన్ జరిగింది. దీనికి సంబంధించి చిన్న ఆపరేషన్ చేయించడం కోసం హాస్పటల్ కి వచ్చాం.
ఎంత చిన్న ఆపరేషన్ అంటే సాయింత్రానికి ఇంటికి వెళ్లిపోయేంత చిన్న ఆపరేషన్ అన్నారు. ఈ విషయం కాస్తా....బన్నికి ఏదో జరిగిందట అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ వార్త కరెక్ట్ కాదు..బన్ని బాగానే ఉన్నాడని చెప్పారు అల్లు అరవింద్.