కుమారులతో కలిసి అల్లు‘ స్టూడియోస్‌’ను నిర్మించనున్న అల్లు అరవింద్!

లెజెండరీ హాస్య నటుడు అల్లు రామలింగయ్య 99వ జయంతి నేడు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకవైపు బడా నిర్మాతగానూ.. మరోవైపు ఓటీటీ వేదిక 'ఆహా' ప్రారంభించి దానిని సక్సెస్ బాటలో నడిపిస్తున్నారు. ఈ క్రమంలోనే అల్లు అరవింద్ మరో అడుగు ముందుకు వేశారు. హైదరాబాద్‌లో అల్లు స్టూడియోస్‌ పేరుతో భారీ స్టూడియోను నిర్మించనున్నట్టు తన తండ్రి జయంతి సందర్భంగా అల్లు అరవింద్ ప్రకటించారు.

అంతే కాదు. తన కుమారులు అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు బాబీలతో కలిసి అల్లు స్టూడియోస్‌ నిర్మాణానికి ప్రారంభోత్సవం కూడా చేశారు. అల్లు అరవింద్ తన ముగ్గురు కుమారుల భాగస్వామ్యంతోనే ఈ భారీ స్టూడియోను నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాలే కాకుండా టీవీ షూటింగ్‌లకు కూడా ఉపయోగపడేలా ఈ స్టూడియోను అల్లు అరవింద్ నిర్మించనున్నట్టు తెలుస్తోంది.

లేటెస్ట్ టెక్నాలజీకి అనుగుణంగా అన్ని రకాల చిత్రీకరణలకు ఉపయోగపడేలా ఈ స్టూడియోను నిర్మించాలని అల్లు అరవింద్, ఆయన కుమారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ అల్లు అరవింద్ చేపట్టిన ప్రాజెక్టులన్నీ మంచి సక్సెస్ సాధించాయి. ఓటీటీ ఫ్లాట్ ఫాం ‘ఆహా’కు కూడా మంచి పేరు ఉంది. ప్రస్తుతం ఈ స్టూడియో నిర్మాణంలో అల్లు అరవింద్‌తో పాటు ఆయన కుమారులు కూడా భాగస్వాములు అవుతున్నారు కాబట్టి ఇక ఇది ఏ రేంజ్‌లో ఉంటుందో వేచి చూడాలి.

More News

కీ్ర్తి సురేశ్ తొలి సినిమా.. నిర్మాత‌ల మ‌ధ్య తొలి వివాదం

జాతీయ ఉత్త‌మ‌న‌టిగా ‘మ‌హాన‌టి’ చిత్రంతో గుర్తింపు సంపాదించుకున్న కీర్తిసురేశ్ తొలి చిత్రం నవీన్ విజయ్‌కృష్ణ హీరోగా రూపొందిన చిత్రం ‘ఐనా నువ్వంటే ఇష్టం’.

ఇట‌లీ బ‌య‌లుదేరిన ప్ర‌భాస్‌

బాహుబ‌లి’ త‌ర్వాత ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్‌.. ఇప్పుడు ఆ రేంజ్‌లోనే సినిమాలు చేస్తున్నారు.

సోషల్ మీడియాను దున్నేస్తున్న ‘నాది నక్కిలీసు గొలుసు’..

‘నాది నక్కిలీసు గొలుసు’ సాంగ్ వినని వారు ఎవరైనా ఉన్నారా? అని ఇప్పుడు అడగటం ఫూలిష్ నెస్ అవుతుందేమో..

ఇప్పటి వరకూ నమోదైన కేసుల్లో ఒక్క సెప్టెంబర్‌లోనే 40 శాతం కేసులు..

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే.. సెప్టెంబర్ నెలలో కరోనా మరింత తీవ్ర రూపం దాల్చింది.

జ‌యం' ర‌వి, ‘అర‌వింద్‌స్వామి’ ల  'బోగ‌న్‌' ట్రైల‌ర్ విడుద‌ల‌

ఇటీవ‌ల 'బోగ‌న్' చిత్రాన్ని రామ్ తాళ్లూరి తెలుగులో అందిస్తున్నార‌నే ప్ర‌క‌ట‌న రాగానే, ప్రేక్ష‌కుల నుంచి అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది.