ఆహా కోసం అరవింద్ గట్టి ప్రయత్నాలు..!
Send us your feedback to audioarticles@vaarta.com
ఓటీటీ మాధ్యమాలు జోరును ముందుగానే ఊహించిన తెలుగు నిర్మాతల్లో అల్లు అరవింద్ ఒకరు. అందుకనే ఆయన తెలుగులో ఆహా అనే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేసి తీసుకొచ్చారు. ఇందులో చాలా మందిని పార్టనర్స్‌గా చేర్చుకున్నారు. ఆహా కంటెంట్‌లో దర్శకుడు క్రిష్ కీలక భూమిక పోషిస్తున్నాడు. అయితే అరవింద్ ఆశించిన స్థాయి కంటే ఎక్కువ రెస్పాన్స్ రావడం లేదట. దీంతో సినిమా రంగానికి చెందిన పలువురు దర్శకులను కంటెంట్ కన్సల్టెంట్స్గా ఉపయోగించుకోవాలని అరవింద్ ప్లాన్స్ చేస్తున్నాడు.
తాజా సమాచారం మేరకు సినిమా రంగంలో కొంత మంది దర్శకులతో ఇప్పటికే అల్లు అరవింద్ చర్చలు జరిపారని వార్తలు వినపడుతున్నాయి. వీరిలో వంశీ పైడిపల్లి, చంద్రసిద్ధార్థ్, నందినీరెడ్డి, విఐ.ఆనంద్‌లను కంటెంట్ కన్సల్టెంట్స్గా నియమించుకున్నారట. వీరందరూ ఇప్పటికే తమ సర్కిల్లోని తమకు తెలిసి మంచి కంటెంట్ అందించే రచయితలతో సంప్రదింపులు జరుపుతున్నారు. తెలుగు సినిమా రంగానికి చెందిన మరికొంత మంది నిర్మాతలు కూడా ఓటీటీ రంగంలోకి అడుగు పెట్టాలని సన్నాహాలు చేసుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీలైనంత మంది తెలుగు ప్రేక్షకులను తన ఓటీటీ సబ్‌స్క్రైబర్స్‌గా చేసుకోవాలని అరవింద్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout