మిడిల్ క్లాస్ అబ్బాయితో అల్లు వార‌బ్బాయి!

  • IndiaGlitz, [Friday,March 29 2019]

ఒక ఫ్లాప్ మ‌నిషిని క‌సిగా ఎద‌గ‌మ‌ని సూచిస్తుంది. ఓ హిట్ మ‌నిషికి ప్ర‌ముఖుల్ని ప‌రిచ‌యం చేస్తుంది. ఈ రెండింటి రుచి బాగా తెలిసిన వాడు వేణు శ్రీరామ్‌. మామూలుగా బంగారు ప‌ళ్లానికి గోడ చేర్పు కావాల‌ని అంటారు. కానీ వేణు శ్రీరామ్‌కి అండ‌గా బంగారు గోడే ఉంది. అదే దిల్ రాజు. దిల్‌రాజు నిర్మాత‌గా వేణు శ్రీరామ్ ఇప్ప‌టికి రెండు సినిమాలు చేశారు. ఒక‌టి ఓ మై ఫ్రెండ్‌. మ‌రొక‌టి ఎంసీఏ. దిల్‌రాజు సంస్థ‌కు బొమ్మ‌రిల్లులాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చిన సిద్ధార్థ్‌, శ్రుతిహాస‌న్‌, హ‌న్సిక కీల‌క పాత్ర‌ధారులుగా తెర‌కెక్కిన ఓ మై ఫ్రెండ్ వేణు శ్రీరామ్‌కు అనుకున్నంత హిట్ ఇవ్వ‌లేదు. కానీ నాని, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన ఎంసీఏ మాత్రం చాలా పెద్ద హిట్ అయింది.

దిల్‌రాజుకు ఆ ఏడాది రెండు హ్యాట్రిక్ లు పూర్తి కావ‌డానికి ఆఖ‌రి సినిమాగా, అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన చిత్ర‌మిది. ఈ సినిమాతోనే ఒకే ఏడాది ఆరు బ్లాక్‌బ‌స్ట‌ర్లు కొట్టిన సంస్థ‌గా దిల్‌రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ రికార్డుల్లో నిలిచింది. అయితే తాజాగా అల్లు అర్జున్ హీరోగా వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు ఓ సినిమా చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే క‌థ విని ఓకే చేశార‌ట బ‌న్నీ. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న బ‌న్నీ, ఆ త‌ర్వాత వేణు శ్రీరామ్ సెట్స్ కు వెళ్లే అవ‌కాశం ఉంది. ఆ త‌ర్వాతే సుకుమార్‌-బ‌న్నీ ప్రాజెక్ట్ ఉంటుంద‌ట‌. సో ఈ మూడు సినిమాల త‌ర్వాత మురుగ‌దాస్‌, విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్నీ న‌టించే అవ‌కాశాలున్నాయి. ఇలా.. ప్ర‌స్తుతానికి త్రివిక్ర‌మ్ సినిమా త‌ర్వాత మిడిల్ క్లాస్ అబ్బాయి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు బ‌న్నీ.

More News

విద్యాబాల‌న్ .. దీదీ!

ద‌క్షిణాది నుంచి బాలీవుడ్‌కు వెళ్లి అక్క‌డ త‌న స‌త్తా చాటిన న‌టి విద్యాబాల‌న్‌. తాజాగా మ‌ళ్లీ ద‌క్షిణాది వైపు మొగ్గుతోంది.

'రావాలి జగన్.. కావాలి జగన్' రికార్డ్!

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గెలుపు కోసం ‘రావాలి జగన్.. కావాలి జగన్’ అనే పాటను పార్టీ శ్రేణులు పాడించిన విషయం విధితమే.

నరేంద్ర మోదీపై ప్రియాంకా గాంధీ పోటీ!?

యావత్ భారత్ వ్యాప్తంగా నరేంద్ర మోదీ హవాను తట్టుకునేందుకు గాను కాంగ్రెస్ పెద్దలు ప్రియాంక గాంధీని రంగంలోకి దింపిన విషయం విదితమే.

1500 కోట్లపై క్లారిటీ ఇవ్వు జగన్..: పవన్

టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ

సీమను 'సౌభాగ్య రాయలసీమ' గా అభివృద్ధి చేస్తా!

రాయ‌ల‌సీమ ప్రాంతం నుంచి వ‌ల‌స‌లు నివారించేందుకు జ‌న‌సేన ప్ర‌భుత్వం వ‌చ్చాక‌ సౌభాగ్య రాయ‌ల‌సీమ ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌నున్న‌ట్టు జ‌న‌సేన అధినేత పవన్ కల్యాణ్