Chandrababu: బీజేపీతో పొత్తు కుదిరింది.. టీడీపీ నేతలతో చంద్రబాబు..

  • IndiaGlitz, [Saturday,March 09 2024]

టీడీపీ ఎన్డీఏలోకి చేరడం ఖాయమైపోయింది. అధికారిక ప్రకటన ఒక్కటే ఆలస్యమైంది. రెండు రోజులు పాటు ఢిల్లీ పర్యటనలో కేంద్ర పెద్దలతో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ చేసిన చర్చలు విజయంతమయ్యాయి. దీంతో ఆరేళ్ల తర్వాత ఎన్డీఏలోకి టీడీపీ చేరుతోంది. తమ కూటమికి ఎందుకు ఓటు వేయాలో ప్రజలకు వివరిస్తామని నేతలు చెబుతున్నారు. ఢిల్లీ పర్యటన విజయవంతంగా ముగియడంతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు.

ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్లు, ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు బీజేపీతో పొత్తుపై కీలక ప్రకటన చేశారు. ‘మనం ఎన్డీఎలోకి వెళుతున్నాం.. సీట్ల సర్దుబాటు కూడా కుదిరింది. పొత్తులపై కూడా త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది. బీజేపీకి 6 అసెంబ్లీ, 5 లోక్‌సభ సీట్లు ఇచ్చాం. బీజేపీ, జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నాం. ఐదేళ్లలో ఏపీని జగన్‌ దివాళా తీయించారు. ఈ పరిస్థితుల్లో ఏపీకి కేంద్ర సహకారం చాలా అవసరం. ఆర్థిక విధ్వంసం నుంచి కోలుకోవాలంటే కేంద్రంతో కలిసి ఉండాలి. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్, విభజన హామీలు నెరవేర్చడం, అరాచక పాలనను అంతమొందించడం కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాం. సోమవారం మిగతా అభ్యర్దుల జాబితా ప్రకటన ఉండొచ్చు. పార్టీలో టిక్కెట్లు రాని, అసంతృప్తిగా ఉన్న వారిని వెంటనే సీనియర్లు.. పిలిపించి మాట్లాడండి’ అని చంద్రబాబు తెలిపారు.

మరోవైపు బీజేపీతో పొత్తులు కుదిరాయని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కూడా తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయన్నారు. సీట్ల సంఖ్యపై ఏ క్షణమైనా అధికారిక ప్రకటన వస్తుందన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్నదే మూడు పార్టీల లక్ష్యమని స్పష్టంచేశారు. ఎన్డీఏలోకి టీడీపీని బీజేపీ ఆహ్వానించిందని ఈ నెల 14వ తేదిన జ‌రిగే ఎన్డీఏ స‌మావేశానికి చంద్రబాబును హాజ‌రుకావాల్సిందిగా అమిత్ షా కోరారని ఆయన వెల్లడించారు. మొత్తానికి పొత్తుల అంశం ఓ కొలిక్కిరావడంతో ఎన్నికల ప్రచారంపై కూటమి నేతలు ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.

More News

Sai Dharam Tej: కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన మెగా హీరో.. పేరు కూడా మార్చుకున్నాడు

మెగా మేనల్లుడు సాయి థరమ్ తేజ్.. హీరోగా కాకుండా మరో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడు. నిర్మాతగా ప్రొడక్షన్ హౌస్ లాంఛ్ చేశాడు. తన తల్లి విజయదుర్గ పేరుతో (Vijay Durga Productions) నూతనంగా ప్రారంభించిన

Asaduddin Owaisi: రేవంత్ సర్కార్ ఐదేళ్లు అధికారంలో ఉంటుంది.. అసదుద్దీన్ ఒవైసీ భరోసా..

తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నిన్నటి వరకు బీఆర్ఎస్‌తో ఉన్న మజ్లిస్ పార్టీ కాంగ్రెస్‌ పార్టీకి దగ్గరవుతుంది. ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం

TSRTC:టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జీతాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం..

ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు 21 శాతం ఫిట్‌మెంట్‌తో కూడిన పీఆర్సీ ఇవ్వనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

Chandrababu and Pawan:అమిత్ షాతో ముగిసిన చంద్రబాబు, పవన్ భేటీ.. బీజేపీకి ఎన్ని సీట్లంటే..?

కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ ముగిసింది.

Siddham: నాలుగో 'సిద్ధం' సభకు భారీ ఏర్పాట్లు.. 15లక్షల మంది వస్తారని అంచనా..

ఏపీలో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతుంది. ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు, మూడు రోజుల్లో ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉండటంతో పార్టీలు ప్రచారంపై దృష్టిపెట్టాయి.