టీవీ5 సాంబశివరావుపై భూకబ్జా ఆరోపణలు.. నెటిజన్లు తీవ్ర విమర్శలు..
Send us your feedback to audioarticles@vaarta.com
టీవీ5 న్యూస్ యాంకర్ సాంబశివరావుకు సంబంధించిన ఓ వ్యవహారం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆయన కుటుంబసభ్యులు నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్ స్థలం కబ్జా చేశారంటూ ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో సంధ్యా గ్రూపునకు సంబంధించిన స్థలంలో సాంబశివరావు కుటుంబ సభ్యులు అక్రమంగా పెట్రోల్ బంక్ నడుపుతున్నట్లు హెచ్‌పీసీఎల్ కంపెనీకి ఫిర్యాదులు అందాయి. దొంగ లీజ్ అగ్రిమెంట్‌తో ఈ పెట్రోల్ బంక్ నడుపుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో రంగంలోకి దిగిన కంపెనీ బృందం పెట్రోల్ బంక్‌లో కొంత స్థలాన్ని సీజ్ చేసింది.
మాదాపూర్‌లో నకిలీ ధ్రువపత్రాలతో పెట్రోల్ బంక్‌ను ఓనర్స్కు తెలియకుండా ఫోర్జరీ సంతకాలతో నిర్వహిస్తున్నారని ఫిర్యాదుచేశారు. ఆక్రమించిన ప్రాంతాన్ని ఖాళీ చేయాలని గతంలోనే కంపెనీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయినా కానీ ఖాళీ చేయకపోవడంతో రంగంలోకి దిగిన అధికారులు ఆ ప్రాంతాన్ని సీజ్ చేశారు. రూపాయి పెట్టుబడి లేకుండానే అధికారులను సాంబశివరావు బురిడీ కొట్టించినట్లు తెలుస్తోంది. 600 చదరపు మీటర్లు స్థలం విషయంలో ఈ వివాదం నెలకొంది.
గతంలో తాము లీజుకు ఇచ్చిన స్థలం కాకుండా మిగిలిన స్థలం కూడా కలిపి సాంబశివరావు కుటుంబ సభ్యులు హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్‌తో లీజుకు ఇచ్చినట్లుగా ఒప్పందం చేసుకున్నారనేది బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితుల ఫిర్యాదుతో మాదాపూర్ పోలీస్ స్టేషన్లో సాంబశివరావు కుటుంబ సభ్యులపై చీటింగ్ కేసు నమోదైందని తెలుస్తోంది. అలాగే దీనిపై హెచ్‌పిసిఎల్ అధికారులు కూడా తెలంగాణ హైకోర్టులను ఆశ్రయించారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొంత స్థలాన్ని మాత్రమే లీజుకు తీసుకుని మిగతా స్థలానికి ఫోర్జరీ డాక్యుమెంట్లను సృష్టించి అధికారులను బురిడీ కొట్టించారని ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం.
కాగా టీవీ5లో అసోసియేట్ ఎడిటర్‌గా పనిచేస్తున్న సాంబశివరావు టాప్ స్టోరీ పేరుతో డిబేట్లు నిర్వహిస్తూ ఉంటారు. ఏపీలోని వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ డిబేట్లు ఉంటాయి. నిత్యం ప్రభుత్వ పెద్దలను విమర్శిస్తూ టీడీపీకి అనుకూలంగా ఆయన వ్యవహారశైలి ఉంటుంది. ఎప్పుడూ చూసినా శుద్దులు చెప్పే సాంబశివరావు.. ఇలా ఫోర్జరీ సంతకాలతో కబ్జాకు పాల్పడటం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. పైకేమో జర్నలిజం ముసుగులో సమాజానికి ఉపయోపడే పెద్ద మనుషులుగా వ్యవహరిస్తూ లోపలేమో ఇలా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడతారా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటి భూ ఆక్రమణ పనులు చేయడం వెనక రాజకీయ అండదండలు ఉండొచ్చని.. పెట్రో బంక్ అనుమతుల విషయంలో పెద్ద పెద్ద రాజకీయ నేతలు హస్తం ఉండే అవకాశం ఉందని ఆరోపిస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరగనుందో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout