మరో స్టార్ హీరోతో అల్లరోడు
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ ఏడాది విడుదలైన `మహర్షి`లో మహేష్ స్నేహితుడి పాత్రలో నటించి మెప్పించాడు హీరో అల్లరి నరేష్. సినిమా పరంగా, కథ పరంగా ఈ పాత్ర చాలా కీలకంగా మారింది. దీంతో నిర్మాతలు అల్లరి నరేష్ వైపు ప్రత్యేక దృష్టితో చూడటం మొదలు పెట్టారు. లేటెస్ట్ సమాచారం ప్రకారం మరోస్టార్ హీరోతో కలిసి అల్లరి నరేష్ నటించబోతున్నాడని టాక్. వివరాల్లోకెళ్తే.. మాస్ మహారాజా రవితేజ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం `డిస్కోరాజా`. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం నరేష్‌ను దర్శక నిర్మాతలు కలిశారట. నరేష్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు లేదు. నరేష్ ఓకే అంటే.. రవితేజతో నరేష్ చేసిన మరో సినిమా ఇదే అవుతుంది. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి `శంభోశివశంభో` సినిమాలో నటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com