మోహన్ బాబుకి నో చెప్పిన అల్లరి నరేష్..
Send us your feedback to audioarticles@vaarta.com
మోహన్ బాబు, అల్లరి నరేష్ కాంబినేషన్లో రూపొందిన క్రేజీ మూవీ మామ మంచు అల్లుడు కంచు. ఈ చిత్రాన్ని శ్రీనివాసరెడ్డి తెరకెక్కించారు. క్రిస్మెస్ కానుకగా ఈ చిత్రాన్ని ఈ నెల 25న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే...మోహన్ బాబు అల్లరి నరేష్ తో ఈ సినిమా గురించి చెప్పి...ఈ సినిమా చేద్దాం అంటే...అల్లరి నరేష్ నో చెప్పాడట. ఈ విషయాన్ని స్వయంగా అల్లరి నరేషే చెప్పాడు. ఇంతకీ నరేష్ మోహన్ బాబుకి ఎందుకు నో చెప్పాడంటే...జేమ్స్ బాండ్ 49వ సినిమా. తరువాత 50వ సినిమాని సోలో హీరోగా చేద్దాం అనుకుంటున్నాను. కనుక మీతో కలసి ఈ సినిమాని ఇప్పుడు చేయను. కావాలంటే 51వ సినిమాగా చేస్తా అన్నాడట. అల్లరి నరేష్ ఆన్సర్ కి మోహన్ బాబు..అంతా రెడీగా ఉంది. నీ ఒక్కడి కోసమే ఆగాలి అన్నాడట. అప్పుడు... నా ఒక్కడి కోసం అంత మంది వెయిట్ చేయడం కరెక్ట్ కాదని భావించి అల్లరి నరేష్ ఓకె చెప్పాడట. అదీ సంగతి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments