నరేష్ సరసన ఆ హీరోయిన్.
Send us your feedback to audioarticles@vaarta.com
అల్లరి నరేష్ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన `సీమశాస్త్రి`, `సీమటపాకాయ్` చిత్రాలు హిలేరియస్ కామెడీతో అందర్నీ ఎంటర్‌టైన్ చేశాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో `అత్తారింటికి దారేది`, `నాన్నకు ప్రేమతో` వంటి భారీ చిత్రాలను అందించిన బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై భోగవల్లి బాపినీడు సమర్పణలో నిర్మిస్తున్న హిలేరియస్ ఎంటర్‌టైనర్ 'ఇంట్లో దెయ్యం.. నాకేం భయం`.
ప్రస్తుతం సినిమా చిత్రీకరణ దశలో ఉంది. హర్రర్ అండ్ కామెడి ఎంటర్ టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో కృతిక ఓ హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో అర్ధనారి హీరోయిన్ మౌర్యాని సెకండ్ హీరోయిన్‌గా సెలక్ట్ అయ్యిందట. త్వరలోనే అధికారక సమాచారం రానుందని విశ్వసనీయవర్గాల సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments