సీక్వెల్ ప్లాన్ లో అల్లరి నరేష్..!
Send us your feedback to audioarticles@vaarta.com
అల్లరి నరేష్ ప్రస్తుతం ఇంట్లో దెయ్యం నాకేం భయం అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే... గతంలో అల్లరి నరేష్ - భీమనేని శ్రీనివాసరావు కాంబినేషన్లో సుడిగాడు సినిమా రూపొందింది.
ఈ చిత్రం అల్లరి నరేష్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు భీమనేని శ్రీనివాసరావు సుడిగాడు సినిమాకి సీక్వెల్ చేసేందుకు ఓ ఇంట్రస్టింగ్ స్టోరీ రెడీ చేసాడట. కథ విని అల్లరి నరేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. సుడిగాడుతో సక్సెస్ సాధించిన అల్లరి నరేష్ - భీమనేని ఈసారి సీక్వెల్ తో కూడా సక్సెస్ సాధిస్తారేమో చూడాలి..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments