'ఇక్షు' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన అల్లరి నరేష్
Send us your feedback to audioarticles@vaarta.com
పద్మజ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై హనుమంత రావు నాయుడు , డాక్టర్ గౌతం నాయుడు సమర్పణలో రాం అగ్నివేష్ కథానాయకుడిగా ఋషిక దర్శకత్వంలో డాక్టర్ అశ్విని నాయుడు నిర్మించిన చిత్రం "ఇక్షు". ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను హీరో అల్లరి నరేష్ చేతుల మీదుగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా..........
హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ఈ సినిమాని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని అలాగే ఈ సినిమా దర్శకురాలు ఋషిక గారికి, నిర్మాత డాక్టర్ అశ్విని నాయుడు గారికి, అలాగే చిత్ర కథానాయకుడు రాం అగ్నివేష్ కి ఈ చిత్రం ద్వారా మంచి పేరు రావాలని అలాగే చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు.
చిత్ర కథానాయకుడు రాం అగ్నివేష్ మాట్లాడుతూ... ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని హీరో అల్లరి నరేష్ గారి చేతుల మీదుగా విడుదల చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఇది మొదటి చిత్రం.ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించి నన్ను మా టీం ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నానని తెలిపారు.
ఈ సినిమా దర్శకురాలు ఋషిక మాట్లాడుతూ .. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని హీరో అల్లరి నరేష్ గారి చేతుల మీదుగా విడుదల చేయించడం చాలా ఆనందం ఉంది.ఆయనకి మా ధన్యవాదాలు. అలాగే ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తయింది. త్వరలో తీసే సాంగ్ తో షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని అతి త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తాము. అలాగే ఈ సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని నాకు మంచి పేరు వస్తుందని అనుకుంటున్నానని తెలిపారు
నటీనటులు; రాజీవ్ కనకాల, కాళికేయ ప్రభాకర్, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, చింటు, రీతు, రేఖ నిరోషా, ఫిద, కెప్టెన్ చౌదరి, తదితరులు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com