ఆన్ లైన్ లో 'ఇంట్లో దెయ్యం..నాకేం భయం' ఆడియో రిలీజ్..!

  • IndiaGlitz, [Monday,October 31 2016]

అల్లరి నరేష్‌ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సీమశాస్త్రి, సీమటపాకాయ్‌ చిత్రాలు హిలేరియస్‌ కామెడీతో అందర్నీ ఎంటర్‌టైన్‌ చేశాయి. అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి భారీ చిత్రాలను అందించిన బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో భోగవల్లి బాపినీడు సమర్పణలో నిర్మిస్తున్న హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ 'ఇంట్లో దెయ్యం.. నాకేం భయం'. ఈ చిత్రం ఆడియో ఈరోజు(అక్టోబర్‌ 31) సాయంత్రం ఆన్‌లైన్‌లో విడుదలవుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి ఈ చిత్రాన్ని నవంబర్‌ 11న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ... ''అల్లరి నరేష్‌, నాగేశ్వరరెడ్డి కాంబినేషన్‌లో రూపొందుతున్న హార్రర్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఫ్యామిలీ అంతా చూసి ఎంజాయ్‌ చేసే విధంగా ఈ చిత్రాన్ని నాగేశ్వరరెడ్డి రూపొందించారు. డెఫినెట్‌గా అందరికీ నచ్చే సినిమా ఇది. ఈ చిత్రం ఆడియోను ఈరోజు సాయంత్రం ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నాం. ఆల్రెడీ విడుదలైన 'శతమానం భవతి...' పాటకు అన్ని చోట్ల నుంచి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. సాయికార్తీక్‌ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని నవంబర్‌ 11న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' మా బేనర్‌లో మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది అన్నారు.
అల్లరి నరేష్‌ మాట్లాడుతూ... ఈ చిత్రంలో నా ఫేవరెట్‌ సాంగ్‌ 'శతమానం భవతి' విడుదలై చాలా పెద్ద హిట్‌ అయింది. సాయికార్తీక్‌ ఈ చిత్రం కోసం అన్నీ సూపర్‌హిట్స్‌ సాంగ్స్‌ చేశారు. నాగేశ్వరరెడ్డిగారితో చేసిన సూపర్‌హిట్‌ చిత్రాలు సీమశాస్త్రి, సీమటపాకాయ్‌ తర్వాత 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' హ్యాట్రిక్‌ మూవీ అవుతుంది. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలకు పూర్తి భిన్నమైన సబ్జెక్ట్‌ ఇది. చాలా ఫన్నీగా వుంటుంది. నేను చాలా ఎంజాయ్‌ చేస్తూ నటించాను. ప్రేక్షకులంతా ఎంజాయ్‌ చేస్తూ ఈ సినిమాని చూస్తారు. ఈ సినిమా నా కెరీర్‌లో మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది అన్నారు.
దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ... హార్రర్‌ మిక్స్‌ అయిన హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. అల్లరి నరేష్‌ కాంబినేషన్‌లో నేను చేస్తున్న మరో సూపర్‌హిట్‌ సినిమా ఇది. ఈ సినిమా మా ఇద్దరికీ హ్యాట్రిక్‌ మూవీ అవుతుంది. సాయికార్తీక్‌ పాటల్ని ఎంత అద్భుతంగా చేశారో రీరికార్డింగ్‌ కూడా అంతే అద్భుతంగా చేశారు. హండ్రెడ్‌ పర్సెంట్‌ అన్నివర్గాల ప్రేక్షకులు ఎంజాయ్‌ చేసేలా 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' సినిమా వుంటుంది అన్నారు.