బాలకృష్ణ106లో అల్లరోడి సందడి ఉంటుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
మహేశ్ ‘మహర్షి’ చిత్రంలో రవి పాత్రలో నటించి మెప్పించిన అల్లరి నరేశ్.. ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాలోనూ నటించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు అల్లరి నరేశ్ ఏ స్టార్ హీరో నటించబోతున్నాడో తెలుసా? నందమూరి బాలకృష్ణ 106వ సినిమాలో. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం షూటింగ్ దశలో ఉంది. కరోనా వైరస్ ప్రభావం ఎక్కువ కావడంతో సినిమా షూటింగ్ ఆపేశారు. ఇప్పుడిప్పుడు షూటింగ్స్ మొదలవుతున్న నేపథ్యంలో అక్టోబర్ నెలలో సినిమాను స్టార్ట్ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.
సిహా, లెజెండ్ చిత్రాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్ మూవీ ఇది. సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో బాలకృష్ణ డ్యూయెల్ రోల్ చేస్తున్నారు. అందులో ఓ పాత్ర అఘోరా పాత్ర అని సమాచారం. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రోమోలో బాలయ్య ఓ లుక్‌లో ఎలా ఉంటాడనేది తెలిసింది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రమిది. దసరా సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com