మలయాళ రీమేక్ లో అల్లరి నరేష్
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ్ పడం రీమేక్‌గా తెలుగులో రూపొందిన సుడిగాడు చిత్రంతో కెరీర్ బెస్ట్ కమర్షియల్ హిట్‌ను సాధించిన వినోదాత్మక చిత్రాల కథానాయకుడు అల్లరి నరేష్ మరోసారి ఓ సెన్సేషనల్ రీమేక్‌లో నటించబోతున్నాడు. మలయాళంలో రూపొంది ఘనవిజయం సాధించిన ఒరు వడక్కన్ సెల్ఫీ చిత్రంలో నరేష్ కథానాయకుడిగా నటించబోతున్నాడు.
కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ మలయాళ చిత్ర రీమేక్ హక్కుల్నీ ఫ్యాన్సీ రేట్‌తో సొంతం చేసుకున్నారు జాహ్నవి ఫిలింస్ అధినేత బొప్పన చంద్రశేఖర్. అల్లరి నరేష్ కథానాయకుడిగా నటించనున్న ఈ తెలుగు రీమేక్‌కు అలా ఎలా చిత్రంతో అందరి ప్రశంసలు అందుకున్న అనీష్ కృష్ణ దర్శకుడు. అక్టోబర్‌లో చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ చిత్రం విశేషాలను నిర్మాత బొప్పన చంద్రశేఖర్ తెలియజేస్తూ.. మలయాళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం హక్కులను సొంతం చేసుకోవడం ఆనందంగా వుంది.
ఇది నరేష్ కెరీర్లో వైవిద్యమైన కమర్షియల్ చిత్రంగా నిలిచిపోతుంది.ఎంటర్టైన్మెంట్, హ్యుమన్ ఎమోషన్స్‌తో పాటు నేటి యువతరం నచ్చే అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా వున్నాయి. గమ్యం తర్వాత నరేష్ నుంచి ప్రేక్షకులు ఆశిస్తున్న డిఫరెంట్ కమర్షియల్ చిత్రమిది. మలయాళంలో ప్రేక్షకుల మన్ననలు పొందిన ఈ చిత్రం తెలుగులో కూడా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తాం అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సాయి శ్రీరామ్, సంగీతం: డి. జె. వసంత్, సమర్పణ: శ్రీమతి నీలిమ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments