మలయాళ రీమేక్ లో అల్లరి నరేష్

  • IndiaGlitz, [Tuesday,August 30 2016]

తమిళ్‌ పడం రీమేక్‌గా తెలుగులో రూపొందిన సుడిగాడు చిత్రంతో కెరీర్ బెస్ట్ కమర్షియల్ హిట్‌ను సాధించిన వినోదాత్మక చిత్రాల కథానాయకుడు అల్లరి నరేష్ మరోసారి ఓ సెన్సేషనల్ రీమేక్‌లో నటించబోతున్నాడు. మలయాళంలో రూపొంది ఘనవిజయం సాధించిన ఒరు వడక్కన్ సెల్ఫీ చిత్రంలో నరేష్ కథానాయకుడిగా నటించబోతున్నాడు.

కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ మలయాళ చిత్ర రీమేక్ హక్కుల్నీ ఫ్యాన్సీ రేట్‌తో సొంతం చేసుకున్నారు జాహ్నవి ఫిలింస్ అధినేత బొప్పన చంద్రశేఖర్. అల్లరి నరేష్ కథానాయకుడిగా నటించనున్న ఈ తెలుగు రీమేక్‌కు అలా ఎలా చిత్రంతో అందరి ప్రశంసలు అందుకున్న అనీష్ కృష్ణ దర్శకుడు. అక్టోబర్‌లో చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ చిత్రం విశేషాలను నిర్మాత బొప్పన చంద్రశేఖర్ తెలియజేస్తూ.. మలయాళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం హక్కులను సొంతం చేసుకోవడం ఆనందంగా వుంది.

ఇది నరేష్ కెరీర్‌లో వైవిద్యమైన కమర్షియల్ చిత్రంగా నిలిచిపోతుంది.ఎంటర్‌టైన్‌మెంట్, హ్యుమన్ ఎమోషన్స్‌తో పాటు నేటి యువతరం నచ్చే అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా వున్నాయి. గమ్యం తర్వాత నరేష్ నుంచి ప్రేక్షకులు ఆశిస్తున్న డిఫరెంట్ కమర్షియల్ చిత్రమిది. మలయాళంలో ప్రేక్షకుల మన్ననలు పొందిన ఈ చిత్రం తెలుగులో కూడా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తాం అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సాయి శ్రీరామ్, సంగీతం: డి. జె. వసంత్, సమర్పణ: శ్రీమతి నీలిమ.

More News

పవర్ స్టార్ అంతరంగం..!

యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు అసోసియేషన్(UKTA)ఆరవ వార్షికోత్సవ వేడుకలు జయతే కూచిపూడి,జయతే బతుకమ్మ సాంస్కృతిక వేడుకలు లండన్ త్రాక్సి లో ఇటీవల ఘనంగా నిర్వహించారు.

'త్రివిక్రమన్' ప్రచార చిత్రం విడుదల!!

"త్రివిక్రమపాండ్యన్" అనే రాజు మరణానికి సంబంధించిన చరిత్ర తెలుసుకోవడానికి వెళ్లిన ఒక బృందం ఎదుర్కొన్న పరిస్థితులు, పరిణామాల సమాహారంగా రూపొందిన చిత్రం "త్రివిక్రమన్".

'మజ్ను' ఆడియో రిలీజ్ డేట్....

భలే భలే మగాడివోయ్,జెంటిల్ మన్ వంటి వరుస సక్సెస్ లు సాధించిన నేచురల్ స్టార్ నాని

42 ఏళ్లు పూర్తి చేసుకున్న బాలయ్య..!

నందమూరి నట సింహం బాలయ్య 42ఏళ్లు పూర్తి చేసుకోవడం ఏమిటి అనుకుంటున్నారా..?నటరత్న నందమూరి ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం తాతమ్మకల.

విశాల్ అప్పుడే డబ్బింగ్ మొదలేట్టేశాడు....

విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ సమర్పణ లో హరి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్ పై సురాజ్ దర్శకత్వంలో జి.హరి నిర్మిస్తున్న చిత్రం