దర్శకుడిగా అల్లరి నరేష్ - ముహుర్తం ఖరారు..!
Send us your feedback to audioarticles@vaarta.com
అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం ఇంట్లో దెయ్యం నాకేం భయం. జి.నాగేశ్వరరెడ్డి తెరకెక్కించిన ఇంట్లో దెయ్యం నాకేం భయం ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అల్లరి నరేష్ ని తన డ్రీమ్ అయిన డైరెక్షన్ గురించి అడిగితే...తప్పకుండా డైరెక్షన్ చేస్తాను అని రిలీజ్ ఎప్పుడో కూడా చెప్పేసారు.
ఇంతకీ అల్లరి నరేష్ దర్శకత్వంలో రూపొందే సినిమా రిలీజ్ ఎప్పుడు అనుకుంటున్నారా..? 2020 మే నెలలో..! అవును ఇది నిజంగా నిజం. ఈ విషయాన్ని అల్లరి నరేషే స్వయంగా చెప్పారు. 2020 మే నెలలో రిలీజ్ చేయాలి అని ముహుర్తం ఖరారు చేయడానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా అని అడిగితే...2020 సౌండింగ్ బాగుంది. మే నెల నాకు బాగా కలిసొచ్చింది. అందుచేత 2020 మే నెలలో దర్శకుడిగా నా తొలి చిత్రాన్ని రిలీజ్ చేయాలి అనుకుంటున్నాను అని చెప్పారు. అది సంగతి..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com