మోహన్ బాబు కాంబినేషన్ లో అయినా..
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ తరంలో వినోదానికి చిరునామాలా నిలిచాడు హాస్య కథానాయకుడు అల్లరి నరేష్. 2002లో తెరంగేట్రం చేసిన నరేష్.. ఈ డిసెంబర్‌లో రానున్న 'మామ మంచు అల్లుడు కంచు'తో 50 చిత్రాల మైలురాయికి చేరుకుంటున్నాడు. ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేని నరేష్‌కి.. ఈ సినిమా ఆ లోటు తీరుస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతోంది.
అయితే ఎటొచ్చి డిసెంబర్ నెలలో నరేష్ హీరోగా విడుదలైన సినిమాలేవీ ఆశించిన విజయాలను ఇవ్వలేదు. తొట్టిగ్యాంగ్ (2002), మా అల్లుడు వెరీగుడ్ (2003), దొంగల బండి (2008), కత్తి కాంతారావు (2010), సంఘర్షణ (2011), యముడికి మొగుడు (2012).. ఇలా డిసెంబర్‌లో వచ్చిన నరేష్ సినిమాలు అయితే యావరేజ్.. లేదంటే ఫ్లాప్ అన్నట్లుగానే ఉన్నాయి కానీ సాలిడ్ హిట్‌కి అయితే నోచుకోలేకపోయాయి.
మరి మోహన్‌బాబుతో చేస్తున్న ఈ 'మామ మంచు..'తోనైనా డిసెంబర్‌లో 50వ సినిమా రూపంలో అదిరిపోయే హిట్‌ని అల్లరి నరేష్ సొంతం చేసుకుంటాడేమో చూడాలి
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments