ప‌ద‌హారేళ్ళు పూర్తి చేసుకున్న అల్ల‌రి న‌రేశ్‌

  • IndiaGlitz, [Thursday,May 10 2018]

హాస్య ప్ర‌ధాన చిత్రాల‌కు చిరునామాలా నిలిచిన ఈ త‌రం హాస్య క‌థానాయ‌కుడు అల్ల‌రి న‌రేశ్‌. ఒక టైమ్‌లో మినిమ‌మ్ గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న న‌రేశ్‌.. వ‌రుస సినిమాలు చేస్తూ వార్తల్లో నిలిచారు. క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అయిన‌ప్ప‌టి నుంచి ప్ర‌తి సంవ‌త్స‌రం సినిమాలు చేస్తూ.. తోటి క‌థానాయ‌కుల‌కు ఆద‌ర్శంగా నిలిచారు.

ఇక ప‌దేళ్ళ క్రితం అంటే.. 2008లో ఏకంగా 8 సినిమాలు చేసి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. అలాంటి న‌రేశ్ క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌మైన తొలి చిత్రం అల్ల‌రి. న‌టుడు ర‌విబాబు తొలిసారిగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ 2002లో మే 10న విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన ఈ సినిమాతో అటు క‌థానాయ‌కుడిగా అల్ల‌రి న‌రేశ్‌కు.. ఇటు ద‌ర్శ‌కుడిగా ర‌విబాబుకి మంచి పేరు వ‌చ్చింది.

ఇద్ద‌రూ కూడా ఆ త‌రువాత వెనుతిరిగి చూడాల్సిన రాలేదు. మొత్తానికి.. క‌థానాయ‌కుడిగా అల్ల‌రి న‌రేశ్ ప్ర‌యాణ‌మై నేటితో 16 ఏళ్ళు పూర్త‌వుతోంద‌న్న‌మాట‌. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం న‌రేశ్ సిల్లీ ఫెలోస్ (భీమినేని శ్రీ‌నివాస‌రావు ద‌ర్శ‌కుడు)తో పాటు గిరి డైరెక్ష‌న్‌లోనూ ఓ మూవీ చేస్తున్నారు. 

More News

సుమంత్ అశ్విన్ హీరోగా ప్రొడక్షన్ నెం.3 'ప్రేమ కథా చిత్రం 2' ప్రారంభం

ప్రేమ కథా చిత్రం, జక్కన్న వంటి బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్స్ తో

'రంగస్థలం' కాంబో రిపీట్ చేస్తుందా?

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

చైతు, మారుతి సినిమా స‌గం పూర్త‌య్యింది

యూత్‌ఫుల్ మూవీస్‌తో విజయాలను అందుకున్న దర్శకుడు మారుతి. 'ఈ రోజుల్లో', 'బస్‌స్టాప్', 'ప్రేమకథా చిత్రమ్', 'కొత్తజంట', 'భలే భలే మగాడివోయ్', 'మహానుభావుడు' లాంటి సినిమాలతో విజయాలను అందుకుని..

లెజెండ్ సినిమా సమర్పణలో విజయ్ ఆంటోనీ 'కాశి' 

సెన్సిబుల్ చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటూ.. నటుడిగా, సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన పంధాను ఏర్పరుచుకొన్న విజయ్ ఆంటోనీ నటించిన తాజా చిత్రం 'కాశి'.

నిర్మాణానంతర‌ ప‌నుల్లో 'దేశంలో దొంగ‌లు ప‌డ్డారు'

ఖ‌యూమ్, త‌నిష్క్ రాజ‌న్, షానీ, పృథ్వీ రాజ్, స‌మీర్, లోహిత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో సారా క్రియేష‌న్స్  పై  గౌత‌మ్ రాజ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో