పదహారేళ్ళు పూర్తి చేసుకున్న అల్లరి నరేశ్
Send us your feedback to audioarticles@vaarta.com
హాస్య ప్రధాన చిత్రాలకు చిరునామాలా నిలిచిన ఈ తరం హాస్య కథానాయకుడు అల్లరి నరేశ్. ఒక టైమ్‌లో మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న నరేశ్.. వరుస సినిమాలు చేస్తూ వార్తల్లో నిలిచారు. కథానాయకుడిగా పరిచయం అయినప్పటి నుంచి ప్రతి సంవత్సరం సినిమాలు చేస్తూ.. తోటి కథానాయకులకు ఆదర్శంగా నిలిచారు.
ఇక పదేళ్ళ క్రితం అంటే.. 2008లో ఏకంగా 8 సినిమాలు చేసి ఆశ్చర్యపరిచారు. అలాంటి నరేశ్ కథానాయకుడిగా పరిచయమైన తొలి చిత్రం అల్లరి. నటుడు రవిబాబు తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ మూవీ 2002లో మే 10న విడుదలై మంచి విజయం సాధించింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమాతో అటు కథానాయకుడిగా అల్లరి నరేశ్‌కు.. ఇటు దర్శకుడిగా రవిబాబుకి మంచి పేరు వచ్చింది.
ఇద్దరూ కూడా ఆ తరువాత వెనుతిరిగి చూడాల్సిన రాలేదు. మొత్తానికి.. కథానాయకుడిగా అల్లరి నరేశ్ ప్రయాణమై నేటితో 16 ఏళ్ళు పూర్తవుతోందన్నమాట. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం నరేశ్ సిల్లీ ఫెలోస్ (భీమినేని శ్రీనివాసరావు దర్శకుడు)తో పాటు గిరి డైరెక్షన్‌లోనూ ఓ మూవీ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com