అల్లరోడు తండ్రయ్యాడు
- IndiaGlitz, [Wednesday,September 28 2016]
రాజేంద్రప్రసాద్ తర్వాత తెలుగులో కామెడి హీరోగా పేరు సంపాదించుకున్న హీరో అల్లరినరేష్ హీరోగా వరుస సినిమాలతో త్వరగా హాప్ సెంచరీలను పూర్తి చేసేశాడు. హీరోగా బిజీగా ఉన్న అల్లరి నరేష్ తండ్రి కూడా అయ్యాడు. తాను ఆడబిడ్డకు తండ్రినయ్యానని అల్లరి నరేష్ స్వయంగా సోషల్ మీడియాలో తెలియజేశాడు.
నాని సహా ఇండస్ట్రీకి చెందిన పలువురు నరేస్ తండ్రి అయిన సందర్భంగా నరేష్ కు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. గతేడాది అల్లరి నరేష్, విరూపను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఈరోజు హైదరాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో ఓ ఆడబిడ్డను జన్మించింది. మొత్తానికి ఇంత కాలం తనదైన సినిమాలతో కామెడిని పంచిన అల్లరోడు తండ్రయ్యాడు...