సుడిగాడు నాకు మగధీర అయి కూర్చుంది...అందుకే అలా జరిగింది. - అల్లరి నరేష్
Tuesday, December 27, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
కామెడీ చిత్రాల కధానాయకుడుగా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని తనకంటూ ప్రత్యేక స్ధానాన్ని ఏర్పరుచుకున్న యువ కథానాయకుడు అల్లరి నరేష్. కామెడీ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి అల్లరి నరేష్ తో తెరకెక్కించిన చిత్రం ఇంట్లో దెయ్యం నాకేం భయం. భారీ చిత్రాల నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించిన ఇంట్లో దెయ్యం నాకేం భయం చిత్రం ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా ఇంట్లో దెయ్యం నాకేం భయం హీరో అల్లరి నరేష్ తో ఇంటర్ వ్యూ మీకోసం...!
ఇటీవల హర్రర్ మూవీస్ చాలా వచ్చాయి కదా..! మరి మీ సినిమా ఇంట్లో దెయ్యం నాకేం భయం లో ఉన్న కొత్తదనం ఏమిటి..?
నిజమే...మీరన్నట్టు ఇటీవల హర్రర్ మూవీస్ చాలా వచ్చాయి. అయితే...హర్రర్ నేపధ్యంతో ఎన్ని సినిమాలు వచ్చినప్పటికీ వాటన్నింటి కంటే కొత్తగా ఉంటుంది మా సినిమా. ఇప్పటి వరకు ఓ ఇంట్లో దెయ్యం ఉంటుంది. ఆ ఇంట్లోకి అనుకోకుండా వెళ్లడం అక్కడ సస్పెన్స్, హర్రర్, కామెడీ ఇలా చూపించారు. కానీ...మా సినిమాలో ఓ పెళ్లి జరిగే ఇంట్లోకి దెయ్యం వస్తే ఎలా ఉంటుందో చూపించాం. చాలా ఎంటర్ టైనింగ్ గా, ఇంట్రస్టింగ్ గా ఉంటుంది.
మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది..?
పెళ్లికి బ్యాండ్ వాయించడానికి వెళతాను. దెయ్యాలను అసలు నమ్మను. అయితే..అక్కడ వచ్చీ రాని మంత్రాలతో దెయ్యం ఆటకట్టించాలని ప్రయత్నిస్తాను. ఈవిధంగా నా క్యారెక్టర్ ఉంటుంది.
నాగేశ్వరరెడ్డి - మీరు కలిసి చేసిన సీమశాస్త్రి, సీమటపాకాయ్ చిత్రాలు సక్సెస్ అయ్యాయి. ఈ మూవీకి కూడా సీమ అని వచ్చేలా టైటిల్ పెట్టాలి అనుకోలేదా..?
నాగేశ్వరరెడ్డి గారితో సినిమా చేస్తున్నాను అనగానే సీమ వచ్చేలా టైటిల్ ఉంటుంది అనుకున్నారు. చాలా మంది ఇలాగే అడిగారు. అలా పెట్టాలంటే సీమలో దెయ్యం నాకేం భయం అని పెట్టాలేమో. సెంటిమెంట్స్ గురించి ఆలోచించకుండా కథకనుగుణంగానే టైటిల్ పెట్టాం.
ఈ టైటిల్ ఎవరు పెట్టారు..?
నేను ఇటీవల ఓ యాభై కథలు వింటే అందులో 30 కధలు దెయ్యం కధలే. బండి రమేష్ చెట్టు మీద దెయ్యం నాకేం భయం అంటాం కదా అలా టైటిల్ పెడితే బాగుంటుంది అని ఇంట్లో దెయ్యం నాకేం భయం అన్నారు. విన్న వెంటనే నచ్చడంతో ఈ టైటిల్ ఫిక్స్ చేసాం.
ఇంతకీ...దెయ్యాల్ని నమ్ముతారా..?
దేవుడిని నమ్ముతాను కానీ...దెయ్యాన్ని నమ్మను.
ఈ సినిమాలో భయపడతారా..? భయపెడతారా..?
భయపడతాను..భయపెడుతూ భయపడతాను.
ఇటీవల కాలంలో మీ సినిమాలు అంతగా సక్సెస్ కాకపోవడానికి కారణం ఏమిటి అనుకుంటున్నారు..?
సుడిగాడు సినిమా నాకు ఎంత మంచి చేసిందో అంత చెడు కూడా చేసింది అని చెప్పచ్చు. ఎందుకంటే సుడిగాడు సినిమా నాకు మగధీర అయి కూర్చుంది. సుడిగాడు తర్వాత నేను చేస్తున్న సినిమా అంటే చాలా ఎక్స్ పెక్ట్ చేసారు. అందులోను ప్రజెంట్ కామెడీ ట్రెండ్ నడుస్తుంది. అందుచేత నేను సినిమా చేస్తున్నాను అంటే ఆడియోన్స్ బాగా ఎక్కువుగా ఎక్స్ పెక్ట్ చేయడం వలన ఇటీవల నా సినిమాలు సక్సెస్ కాలేదు అనుకుంటున్నాను.
ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కదా..! రొమాన్స్ ఎలా ఉంటుంది..?
రొమాన్స్ అంటే భయం. ఎందుకంటే...రొమాన్స్ వాళ్లతో చేయకుండా వేరే వాళ్లతో చేస్తే దెయ్యానికి కోపం వస్తుంది.ఈ చిత్రంలోని హీరోయిన్స్ ఇద్దరి పాత్రలు ఆడియోన్స్ ఎంజాయ్ చేసేలా ఉంటాయి.
మీరు చేసిన కామెడీ సినిమాలు అంతగా సక్సెస్ కాలేదని కామెడీ నుంచి బయటకు రావాలి అనుకున్నారా..?
అలా అనుకుని చేసిన సినిమాలు ఆడలేదు. లడ్డుబాబు సినిమాని అలా అనుకుని చేసిందే కానీ...సక్సెస్ కాలేదు. కామెడీ సినిమా అంటే ఏదో కామెడీ కోసం సినిమా అని కాకుండా కథలోనే కామెడీ ఉండాలి దీనికి తోడు ఎమోషన్ ఉండాలి అప్పుడే ఆడియోన్ కి కనెక్ట్ అవుతుంది.
ఈ సంవత్సరం ఫాదర్ గా ప్రమోషన్ వచ్చింది కదా..!
అవునండి. నాకు తెలిసి పెళ్లైన తర్వాత బాధ్యత పెరుగుతుంది అంటారు కానీ...పిల్లలు పుట్టిన తర్వాతే బాధ్యత పెరుగుతుంది. ఈ సంవత్సరంలో పాప పుట్టింది చాలా హ్యాపీగా ఉంది.
డైరెక్షన్ చేస్తాను అని గతంలో చెప్పారు. ఇంతకీ మీ డైరెక్షన్ లో మూవీ ఎప్పుడు..?
కథ రాసుకున్నాను. హార్ట్ టచ్చింగ్ లవ్ స్టోరీ తెరకెక్కించాలి అనుకుంటున్నాను. 2020 మే నెలలో నేను డైరెక్ట్ చేసిన సినిమాని రిలీజ్ చేయాలి అనుకుంటున్నాను. 2020 సౌండింగ్ బాగుంది. మే నెల నాకు బాగా కలిసొచ్చింది. అందుకనే 2020 మే లో దర్శకుడిగా నా తొలి సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాను.
ఇ.వి.వి బ్యానర్ పై సినిమా ఎప్పుడు..?
నాన్నగారి జయంతి జూన్ 10న. ఆరోజున సినిమా ప్రారంభించాలి అనుకుంటున్నాం.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?
అలా ఎలా డైరెక్టర్ అనీష్ కృష్ణ దర్శకత్వంలో చేయబోయే సినిమా ఫిబ్రవరిలో ప్రారంభం అవుతుంది. ఆతర్వాత భీమనేని డైరెక్షన్ లో ఓ మూవీ, సతీష్ డైరెక్షన్ లో మరో మూవీ చేయనున్నాను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments