కామెడీ సినిమాలంటే అనే చిన్నచూపు...అందుకే నేను ఇలా చేస్తున్నాను - అల్లరి నరేష్

  • IndiaGlitz, [Thursday,July 14 2016]

అల్ల‌రి న‌రేష్ హీరోగా సిద్దు ఫ్ర‌మ్ సికాకుళం డైరెక్ట‌ర్ ఈశ్వ‌ర్ రెడ్డి తెర‌కెక్కించిన చిత్రం సెల్ఫీ రాజా. ఈ చిత్రంలో అల్ల‌రి న‌రేష్ స‌ర‌స‌న సాక్షి చౌద‌రి, కామ్నా సింగ్ ర‌నావ‌త్ న‌టించారు. ఈ మూవీని గోపీ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై చ‌ల‌సాని రామ బ్ర‌హ్మాం నిర్మించగా, రామ‌బ్ర‌హ్మాం సుంక‌ర స‌మ‌ర్పిస్తున్నారు. వైవిధ్య‌మైన క‌థాంశంతో ఫుల్ లెంగ్త్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన సెల్ఫీ రాజా చిత్రాన్ని ఈ నెల 15న రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా సెల్ఫీరాజా అల్ల‌రి న‌రేష్ తో ఇంట‌ర్ వ్యూ మీకోసం...
సెల్ఫీరాజా కాన్సెప్ట్ ఏమిటి..?
సెల్ఫీ రాజా సెల్ఫీవీక్ నెస్ తో అంద‌ర్నీ ఇబ్బంది పెడుతుంటాడు. త‌ను కూడా ఇబ్బంది ప‌డుతుంటాడు ఎంత‌లా అంటే...సెల్ఫీ వీక్ నెస్ తో త‌న ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటాడు. ఈ విధంగా మూవీ చాలా స‌ర‌దాగా ఉంటుంది. ప్ర‌జెంట్ సెల్ఫీ ట్రెండ్ ఎలా ఉందో చూస్తున్నాం క‌దా..ఒక సెకండ్ సంతోషం కోసం సెల్ఫీ తీసుకుంటుంటే ఒక్కోసారి ఎలాంటి అన‌ర్ధాలు జ‌రుగుతున్నాయో చూస్తున్నాం క‌దా. దీనిని సీరియ‌స్ గా కాకుండా కామెడీగా చూపిస్తున్నాం.
సెల్ఫీరాజా అని టైటిల్ పెట్ట‌డానికి కార‌ణం..?
టైటిల్ కొత్త‌గా ఉండాలి..ట్రెండీగా ఉండాలి అని ఆలోచిస్తున్న‌ప్పుడు సెల్ఫీ అనేది అంద‌రికీ ఈజీగా రీచ్ అవుతుంది అనిపించింది. అంతే కాకుండా ఈ స్టోరీకి ఈ టైటిల్ క‌రెక్ట్ గా స‌రిపోతుంది అనిపించ‌డంతో సెల్ఫీ రాజా అని పెట్టాం.
విజ‌య్ మాల్యా తో సెల్ఫీ తీసుకున్న‌ట్టు స్టిల్ రిలీజ్ చేసి టైటిల్ ఎనౌన్స్ చేసారు క‌దా...నిజంగా విజ‌య్ మాల్యాతో సెల్ఫీ తీసుకున్నారా..?
లేదండి బాబు...ఆయ‌న‌తో నేను సెల్ఫీ తీసుకోవ‌డం ఏంటి...అది ఫోటో షాప్ లో అలా డిజైన్ చేసి టైటిల్ రిలీజ్ చేస్తే బాగుంటుంది అనిపించింది చేసాం అంతే.
సెల‌బ్రిటీస్ క‌నిపిస్తే చాలు..సెల్ఫీ అంటున్నారు క‌దా...ఎవ‌రైనా మీతో సెల్ఫీ అంటే ఎలా ఫీల‌వుతుంటారు..?
ఒక్కోసారి బాగానే ఉంటుది కానీ...ఒక్కోసారి మాత్రం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. ఇటీవ‌ల జి.వి.కె మాల్ లో ఓ మూవీకి వెళ్లాను. ఇంట‌ర్వెల్ లో టాయిలెట్ కి వెళుతుంటే...ఒకాయ‌న వ‌చ్చి నాతో సెల్ఫీ తీసుకుంటున్నాడు. ఇది టాయిలెట్ అండీ..ఇక్క‌డ బాగోదు అని చెప్పినా విన‌డం లేదు. అలాగే ఒక్కోసారి మ‌న‌కు తెలిసిన వాళ్లు చనిపోయార‌ని వెళితే అక్క‌డ కూడా ఒక ఫోటో తీసుకుంటాం అని అడుగుతారు.
అక్క‌డ ప‌రిస్థితి ఏమిటో అర్థం చేసుకోవ‌డం లేదు అలాంట‌ప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది.
మీరు బాగా ఇష్ట‌ప‌డి తీసుకున్న సెల్ఫీ ఏది..?
నాకు సెల్ఫీ అంటే అస‌లు ఇష్టం ఉండ‌దు.
వివాద‌స్ప‌ద‌మైన చెప్ప‌ను బ్ర‌ద‌ర్...డైలాగ్ సెల్ఫీ రాజాలో పెట్ట‌డానికి కార‌ణం..?
చెప్ప‌ను బ్ర‌ద‌ర్...వివాద‌స్ప‌దం గురించి నాకు ఈ మ‌ధ్యే తెలిసింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారి ఫ‌స్ట్ ఫిల్మ్ ని నాన్న‌గారే తీసారు అంద‌రికీ తెలిసిందే. అలాగే బ‌న్ని నాకు మంచి ఫ్రెండ్. ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారంటే గౌర‌వం. నా సినిమాల్లో స్ఫూఫ్ లు చేసినా న‌న్ను నేను త‌గ్గించుకుంటాను కానీ...ఎవ‌ర్ని త‌క్కువుగా చూపించ‌ను. ఎవ‌ర్నీ విమ‌ర్శించ‌ను. సినిమా చూసిన త‌ర్వాత అంద‌రూ న‌వ్వుకుంటారు. చెప్ప‌ను బ్ర‌ద‌ర్ డైలాగ్ వ‌ల‌న బ‌న్ని కూడా నువ్వుకుంటాడ‌నే అనుకుంటున్నాను.
ఈ మ‌ధ్య స్పీడు తగ్గించిన‌ట్టున్నారు..?
కావాల‌నే స్పీడు త‌గ్గించాను. ప్ర‌జెంట్ హిట్ అనేది కంప్ల‌స‌రీ అయ్యింది. అదీ కాకుండా క్వాలీటీ బాగుండాలి అని కూడా స్పీడు త‌గ్గించాను. కామెడీ సినిమాల్లో... క్వాలిటీ అంత‌గా ఉండ‌దు...సాంగ్స్ బాగోవు అని కామెడీ సినిమాలంటే ఓ చిన్న‌చూపు ఉంది. అందుక‌నే కామెడీ చిత్రాల‌ని మంచి క్వాలిటీతో అందించాల‌ని స్పీడు తగ్గించాను. అలాగే ఒక సినిమా త‌ర్వాత మ‌రో సినిమా చేయ‌డం వ‌ల‌న‌ నిర్మాత‌కు కూడా ప్ర‌యోజ‌నం ఉంటుంది.
గ‌తంలో కామెడీ అంటే మీరే చేసేవారు. కానీ..ఇప్పుడు అంద‌రూ కామెడీ చేసేస్తున్నారు దీని ప్ర‌భావం మీపై ప‌డిందా..?
ఎన్టీఆర్ గారు, ఎ.ఎన్.ఆర్ గారు టైమ్ లో కామెడీ అనేది స‌ప‌రేట్ ట్రాక్ లా ఉండేది. ఇప్పుడు కామెడీ అనేది మేజ‌ర్ అయ్యింది. మిగ‌తా హీరోలు కామెడీ తో పాటు ల‌వ్ సీన్స్, యాక్ష‌న్ సీన్స్ చేస్తున్నారు. ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా అంటే నేనే చేయాలి. అందుచేత మిగ‌తా వాళ్లు కామెడీ చేయ‌డం వ‌ల‌న నాపై ప్ర‌భావం ప‌డింది అని అనుకోవ‌డం లేదు.
డైరెక్ష‌న్ ఎప్పుడు చేయ‌బోతున్నారు..?
ప్ర‌స్తుతం మూడు సినిమాల‌కు సైన్ చేసాను. ఈ మూడు సినిమాలు పూర్తి చేసిన త‌ర్వాత డైరెక్ష‌న్ చేస్తాను. నా ఫ‌స్ట్ ఫిల్మ్ ఇ.వి.వి బ్యాన‌ర్ లోనే ఉంటుంది. నేను డైరెక్ష‌న్ చేస్తాను అంటే ఏదో కామెడీ సినిమా తీస్తాను అనుకుంటే పొర‌పాటే. నేను తీసే సినిమా 7|జి బృందావ‌న కాల‌నీ, నేను త‌ర‌హాలో ఉంటుంది.
హ‌ర్ర‌ర్ కామెడీ ట్రెండ్ అయిపోతున్న టైమ్ లో ఇంట్లో దెయ్యం నాకేంటి భ‌యం అని హ‌ర్ర‌ర్ మూవీ చేస్తున్నారేంటి..?
హ‌ర్ర‌ర్ ట్రెండ్ అయిపోవ‌డం అంటూ ఏమీ ఉండ‌దండి. మ‌న క‌ళ్ల ముందు ఎవ‌రైనా ప‌డిపోతే అయ్యే పాపం..అంటాం వెళ్లి హెల్ప్ చేస్తాం. అదే సినిమాల్లో అయితే...బాబు మోహ‌న్ గార్ని కోట గారు కొడుతుంటే ఎంజాయ్ చేస్తుంటాం. సో...హ‌ర్ర‌ర్ కామెడీ ట్రెండ్ అయిపోవ‌డం అంటూ ఉండ‌దు అనేది నా అభిప్రాయం. నాకు తెలిసి 16 హ‌ర్ర‌ర్ కామెడీ సినిమాలు ప్రొడ‌క్ష‌న్ లో ఉన్నాయి.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?
జి.నాగేశ్వ‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఇంట్లో దెయ్యం నాకేంటి భ‌యం చేస్తున్నాను. అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో మేడ మీద అబ్బాయి అనే సినిమా చేస్తున్నాను. ఈ సినిమా త‌ర్వాత న‌వంబ‌ర్ నుంచి స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ్ మూవీ చేస్తున్నాను.

More News

దాసరి నారాయణరావుని కలిసిన 'ఫ్రెండ్ రిక్వెస్ట్ ' టీమ్

హీరో ఆదిత్య ఓం స్వీయ దర్శకత్వంలో మోడరన్ సినిమా పతాకంపై కొత్త హీరో,హీరోయిన్లతో విజయ్ వర్మ పాకలపాటి సహనిర్మాతగా నిర్మించిన యూత్ఫుల్ఎంటర్ టైనర్ 'ఫ్రెండ్ రిక్వెస్ట్'.

'కబాలి' నిర్మాతల కేసు....

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో కలైపులి థాను సమర్పణలో

నాన్నకల నెరవేర్చడానికి రెడీ అవుతున్న అల్లరి నరేష్..

అల్లరి నరేష్ సెల్ఫీరాజా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

మ‌హేష్ హీరోయిన్ ని క‌న్ ఫ‌ర్మ్ చేసిన మురుగ‌..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు - మురుగుదాస్ కాంబినేష‌న్ లో రూపొందనున్న చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ ఈనెల 29న ప్రారంభం కానుంది. దాదాపు 100 కోట్ల బ‌డ్జెట్ తో రూపొంద‌నున్న ఈ చిత్రాన్ని ఎన్.వి.ప్ర‌సాద్, ఠాగూర్ మ‌థు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

నాని, నితిన్ చేతుల మీదుగా 100 డేస్ ఆఫ్ లవ్ ఆడియో విడుదల

ఓకే బంగారం విజయం తర్వాత దుల్కర్ సల్మాన్,నిత్యామీనన్ జంటగా నటించిన మలయాళ చిత్రాన్ని తెలుగులోనూ అదే పేరుతో '100డేస్ ఆఫ్ లవ్' విడుదల చేస్తున్నారు.