Manchu Manoj:"పవన్ కళ్యాణ్ అన్నకి ఆల్ ది బెస్ట్".. మంచు మనోజ్ వ్యాఖ్యలు వైరల్..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ రాజకీయాల గురించి సినీ హీరో మంచు మనోజ్ వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవుతున్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్ శిల్పకళావేదికలో గ్రాండ్‌గా జరిగాయి. ఈ వేడుకలకు పలువురు దర్శకులు, నిర్మాతలు, యువ హీరోలు వచ్చారు. అలాగే మనోజ్ కూడా హాజరై మాట్లాడారు. చరణ్, తాను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగామని.. ఎవరైనా కష్టాల్లో ఉంటే సహాయం చేసే గుణం కలిగిన వ్యక్తి అని ప్రశంసించాడు. 2018లో ఒక ఆడబిడ్డకు సహాయం చేయడం కోసం అర్ధరాత్రి ఫోన్ చేస్తే వెంటనే స్పందించాడని గుర్తుచేసుకున్నాడు.
ఈ క్రమంలోనే మెగా, మంచు కుటుంబాల గొడవలు గురించి కూడా స్పందించాడు. చిరంజీవి, మోహన్ బాబు మధ్య గొడవలు రావొచ్చు కానీ అవి భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు లాంటివన్నారు. ఆ గొడవల మధ్యకి ఎవరైనా వెళ్ళారా వాళ్ళే దెబ్బతింటారని.. వీరిద్దరి మధ్య గొడవలు కూడా అలాంటివే అన్నారు. వాళ్లది 40 ఏళ్ళ స్నేహం.. వాళ్లిద్దరూ టామ్ అండ్ జెర్రీ లాంటివారు అని పేర్కొన్నాడు. అంతేకాదు మోహన్ బాబు స్టైల్‌లో "ది రిలేషన్ బిట్వీన్ మెగా అండ్ మంచు ఫ్యామిలీ ఈజ్ ఫిష్ అండ్ వాటర్. బట్ నాట్ ఏ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్" అంటూ చెప్పుకొచ్చారు.
ఇక చివర్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతూ.. "పవన్ కళ్యాణ్ అన్నకి ఆల్ ది బెస్ట్" అని చెప్పాడు. దీంతో ఏపీ ఎన్నికల నేపథ్యంలోనే పవన్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాడని అర్థమవుతోంది. దీంతో జనసైనికులు మనోజ్ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఇటీవల తిరుపతిలో జరిగిన మోహన్ బాబు బర్త్ డే సెలబ్రేషన్స్‌లో కూడా రాజకీయాల గురించి మనోజ్ చేసిన కామెంట్స్ జనసేన గురించే అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అనంతరం ఆ వ్యాఖ్యలపై మనోజ్ స్పందిస్తూ ఏ పార్టీ గురించి తాను మాట్లాడలేదని క్లారిటీ ఇచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments