వెంకీ న్యూ ప్రాజెక్ట్ కి అంతా ఓకె..

  • IndiaGlitz, [Thursday,October 29 2015]

విక్ట‌రీ వెంక‌టేష్ గోపాల గోపాల త‌ర్వాత న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయ‌డానికి చాలా గ్యాప్ తీసుకున్నాడు. లేటుగా వ‌చ్చినా...లేటెస్ట్ గా వ‌స్తాన‌న్న‌ట్టు స‌రికొత్త‌గా క‌నిపించి అల‌రించ‌డానికి అంతా ఓకె చేసాడ‌ట‌. చిన్న సినిమాల‌తో పెద్ద విజ‌యాన్ని సాధించి టాలీవుడ్ లో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన మారుతి డైరెక్ష‌న్ లో న‌టించేందుకు వెంకీ ఎప్పుడో గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు.

గ‌తంలో వెంకీ, మారుతి తో రాథ అనే సినిమా చేయాల‌నుకున్నా...కుద‌ర‌లేదు. . ఇన్నాళ్ల‌కు అంతా కుదిరిందట‌. వెంకీ హీరోగా మారుతి తెర‌కెక్కించే సినిమాను హారిక - హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాధాక్రిష్ణ నిర్మించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ మూవీకి వెంకీ స‌ర‌స‌న న‌య‌న‌తార‌ను ఫిక్స్ చేసార‌ట‌. డిసెంబ‌ర్ నుంచి షూటింగ్ ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. వెంకీ, న‌య‌న‌తార కాంబినేష‌న్లో ల‌క్ష్మీ, తుల‌సి..చిత్రాలు రూపొందాయి. మ‌రి..ఈసారి వెంకీ, న‌య‌న్ క‌లిసి న‌టించే సినిమాకి ఏ టైటిల్ పెడ‌తారో...చూడాలి.