కంఫర్మ్: సౌరవ్ గంగూలీ బయోపిక్ కి అంతా రెడీ.. హీరో ఎవరో తెలుసా!
Send us your feedback to audioarticles@vaarta.com
ఇండియన్ క్రికెట్ కి కొత్త ఊపు తీసుకువచ్చిన క్రికెటర్ సౌవర్ గంగూలీ. మూసగా సాగుతున్న ఇండియన్ క్రికెట్ ని తన అగ్రెసివ్ నిర్ణయాలతో పరుగులు పెట్టించాడు. యువతకు పెద్ద పీఠవేసి కొత్త టాలెంట్ ని ప్రోత్సహించాడు. తన తర్వాత ఇండియన్ క్రికెట్ లో స్టార్స్ గా ఎదిగిన ఎంతో మంది క్రికెటర్స్ గంగూలీ హయాంలో వెలుగులోకి వచ్చిన వారే. సెహ్వాగ్, యువరాజ్, జహీర్ ఖాన్ లాంటి మేటి క్రికెటర్లు గంగూలీ కెప్టెన్సీ లో రాటుదేలారు.
ఇండియన్ క్రికెట్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్లలో గంగూలీ ముందు వరుసలో ఉంటాడు. గంగూలీ కెరీర్ లో ఎత్తు పల్లాలు ఉన్నాయి.. వివాదాలు కూడా ఉన్నాయి. గంగూలీ బయోపిక్ తెరకెక్కిస్తే ఆసక్తికరమైన వెండితెర చిత్రం అవుతుందనడంలో సందేహం లేదు.
ఇప్పటికే మహేంద్ర సింగ్ ధోని, సచిన్ టెండూల్కర్ బయోపిక్ చిత్రాలు తెరకెక్కాయి. సౌరవ్గంగూలీ బయోపిక్ కి కూడా రంగం సిద్ధం అయింది. తన బయోపిక్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు స్వయంగా గంగూలీ ప్రకటించారు. ప్రస్తుతం గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్ గా బ్యాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
లార్డ్స్ మైదానంలో 2002లో జరిగిన నాట్ వెస్ట్ సిరీస్ ఫైనల్ గుర్తుందిగా. ఆ గంగూలీ సారధ్యంలో ఆ మ్యాజికల్ విక్టరీకి సరిగ్గా 19 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా గంగూలీ తన బయోపిక్ పై ఓపెన్ అయ్యారు. నా బయోపిక్ చిత్రానికి అంగీకారం చెప్పాను. టాప్ ప్రొడక్షన్ హౌస్ లో 200 కోట్ల బడ్జెట్ లో ఆ చిత్రం తెరకెక్కుతుంది. దర్శకుడి వివరాలు ఇప్పుడే చెప్పలేను అని గంగూలీ అన్నారు.
ఈ చిత్రానికి 'దాదా' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. స్టార్ హీరో రణబీర్ కపూర్ గంగూలీ రోల్ ప్లే చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments