రవిప్రకాష్ గుట్టు రట్టు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం
Send us your feedback to audioarticles@vaarta.com
టీవీ9 రవిప్రకాష్ వివాదం గంటకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే నేషనల్ ట్రిబ్యునల్, హైకోర్టులో రవిప్రకాష్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రవిప్రకాష్‌పై మరోకేసు నమోదైంది. సైబర్‌బాద్ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట ఇంతవరకూ హాజరుకాకపోవడంతో రవిప్రకాష్‌ను అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు. సైబరాబాద్ పోలీసులు ఇచ్చిన రెండు నోటీసులకు రవిప్రకాష్ ఇంత వరకూ స్పందించకపోవడంతో పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు.
అయితే.. నోటీసులకు రవిప్రకాష్ రియాక్ట్ అవుతూ విచారణకు 10 రోజులు గడువు కావాలని మెయిల్లో కోరారు. వ్యక్తిగతంగా హాజరుకాని నేపథ్యంలో ఇక అరెస్ట్‌లే ఉంటాయని పోలీసులు స్పష్టం చేయడంతో ఎట్టకేలకు వెనక్కి తగ్గిన రవిప్రకాష్ పది రోజులు గడువు కోరారు. కాగా ఇప్పటి వరకూ రవిప్రకాష్‌పై మొత్తం సైబరాబాద్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. రవిప్రకాష్ చేసిన ఈ-మెయిల్స్ వ్యవహారాన్ని పోలీసులు గుట్టు రట్టు చేశారు. తాను ఇబ్బందుల్లో ఉన్నానని, వ్యక్తిగత కారణాల దృష్ట్యా విచారణకు హాజరు కాలేనని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ అధికారిక ఈ-మెయిల్‌కు సందేశం పంపినట్లు తెలుస్తోంది.
మరోవైపు సినీనటుడు శివాజీ కూడా తాను అనారోగ్యంతో బాధ పడుతున్నానని, కేసు విచారణకు హాజరయ్యేందుకు 10 రోజుల గడవు కావాలని ఈ-మెయిల్ సందేశం పంపినట్లు సమాచారం. అయితే రవిప్రకాష్, శివాజీ ఇద్దరూ ఎక్కడ్నుంచి మెయిల్ చేశారని.. ఎక్కడున్నారు..? మొత్తం ఐపీ అడ్రస్ ద్వారా ఆచూకి తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. వారిద్దరూ ఒకే చోట ఉన్నారా..? లేకుంటే వేర్వేరు ప్రాంతాల నుంచి మెయిల్ చేశారా..? అనే విషయం తెలియాల్సి ఉంది. సో.. రవిప్రకాష్, శివాజీ ఎక్కడున్నది పోలీసులకు దాదాపు తెలిసిపోయిందన్న మాట. వీలైనంత త్వరలోనే రవిప్రకాష్, శివాజీని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపర్చాలనే యోచనలో పోలీసులు ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments