'రంగం 2' ఆడియో వేడుకకు 'రంగం' సిద్ధం!!
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌గుడ్ మూవీస్ అధినేత ఆర్.బి.చౌదరి తనయుడు జీవా నటించిన రంగం` ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రముఖ సినిమాటోగ్రఫర్ కె.వి.ఆనంద్ దర్శకుడిగా మారి రూపొందించిన ఈ చిత్రంలో జీవా సరసన నిన్నటి తరం బ్యూటీక్వీన్ రాధ పెద్ద కుమార్తె కార్తీక నటించింది. మరో ప్రముఖ సినిమాటోగ్రఫర్ రవి.కె.చంద్రన్ దర్శకుడిగా పరిచయమవుతూ తమిళంలో రూపొందించిన యాన్` చిత్రాన్ని తెలుగులో రంగం-2` పేరుతో అనువదిస్తున్నారు. జస్‌రాజ్ ప్రొడక్షన్స్ సమర్పణలో` శ్రీలక్ష్మిజ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఎ.ఎన్.బాలాజీ (సూపర్‌గుడ్ బాలాజీ) ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. రంగం` చిత్రానికి సంగీతం సమకూర్చి..
ఆ చిత్రం సాధించిన సంచలన విజయంలో సముచిత పాత్ర పోషించిన సంగీత సంచలనం హ్యారిస్ జైరాజ్ రంగం-2` చిత్రానికి కూడా సంగీత సారధ్యం వహించగా` రాధ చిన్న కుమార్తె తులసీ నాయర్ ఈ చిత్రంలో జీవాతో జత కట్టింది. వెన్నెలకంటి సాహిత్యం సమకూర్చగా ప్రముఖ గాయనీగాయకులు ఆలపించిన రంగం-2` గీతాలు అతి త్వరలో విడుదల కానున్నాయి. హీరోహీరోయిన్‌లు జీవా` తులసీ నాయర్‌తోపాటు సంగీతదర్శకులు హ్యారిస్ జైరాజ్ సమక్షంలో రంగం-2` ఆడియో వేడుక వైభవంగా నిర్వహించేందుకు చిత్ర నిర్మాత ఎ.ఎన్.బాలాజీ (సూపర్‌గుడ్ బాలాజీ) సన్నాహాలు చేస్తున్నారు.
నాజర్, జయప్రకాష్, ఊర్మిళ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, సంగీతం: హ్యారిస్ జైరాజ్, సమర్పణ: జస్‌రాజ్ ప్రొడక్షన్స్, నిర్మాత: ఎ.ఎన్.బాలాజీ (సూపర్‌గుడ్ బాలాజీ), కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: రవి.కె.చంద్రన్!!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments